Balakrishna: ‘ఇట్లు...’ బాలకృష్ణ

తారలు ఒకరి సినిమా సెట్‌కి మరొకరు వెళ్లి సందడి చేయడం తరచూ జరిగేదే. పక్కపక్కనే చిత్రీకరణలు జరుగుతున్నాయంటే తప్పకుండా ఆయా తారలు, ఆ సినిమాల బృందాలు కలుసుకుంటూ ఉంటాయి. అలా ఇటీవల అల్లరి నరేష్‌  ‘ఇట్లు మారేడుమిల్లి

Updated : 04 Jul 2022 07:47 IST

తారలు ఒకరి సినిమా సెట్‌కి మరొకరు వెళ్లి సందడి చేయడం తరచూ జరిగేదే. పక్కపక్కనే చిత్రీకరణలు జరుగుతున్నాయంటే తప్పకుండా ఆయా తారలు, ఆ సినిమాల బృందాలు కలుసుకుంటూ ఉంటాయి. అలా ఇటీవల అల్లరి నరేష్‌ (Naresh) ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ (Maredumilli Prajaneekam) చిత్రబృందం బాలకృష్ణని(Balakrishna) కలిసింది. బాలకృష్ణ సినిమా సెట్‌కి సమీపంలోనే నరేష్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ చిత్రీకరణ జరిగింది. ఈ సందర్భంగా కలిసిన అల్లరి నరేష్‌, ఇతర చిత్రబృందంతో బాలకృష్ణ సరదాగా ముచ్చటిస్తూ వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. ఆ చిత్రమే ఇది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని