Naresh: ‘మళ్ళీ పెళ్లి’.. వీడియో షేర్ చేసిన నరేశ్
నటుడు నరేశ్ (Naresh) తాజాగా ఓ వీడియో షేర్ చేశారు. ‘మళ్ళీ పెళ్లి’ (Malli pelli)పేరుతో తానొక సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు.
హైదరాబాద్: తన పెళ్లిపై ఇటీవల కాలంలో జరిగిన ప్రచారాలన్నింటికీ పుల్‌స్టాప్ పెడుతూ నటుడు నరేశ్ (Naresh) తాజాగా ఓ వీడియో షేర్ చేశారు. పవిత్రా లోకేశ్ (Pavitra Lokesh)తో కలిసి తాను ఓ సినిమాలో నటిస్తున్నట్లు వెల్లడించారు. ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘మళ్ళీ పెళ్లి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. తెలుగు, కన్నడ భాషల్లో ఇది విడుదల కానుంది. విజయకృష్ణ మూవీస్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని వేసవి కానుగా విడుదల చేయనున్నారు. ఈ మేరకు ‘మళ్ళీ పెళ్లి’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌తోపాటు స్పెషల్ వీడియోను శుక్రవారం ఆయన ట్విటర్ వేదికగా సినీ ప్రియులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఇది నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
నరేశ్ - పవిత్రల గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని, పెళ్లి చేసుకుంటున్నారని నెటిజన్లు మాట్లాడుకున్నారు. కొత్త ఏడాదికి శుభాకాంక్షలు చెబుతూ నరేశ్ షేర్ చేసిన ఓ వీడియోతోపాటు పెళ్లి వీడియో ఈ చర్చకు మరింత బలాన్ని చేకూర్చాయి. ఆయా వీడియోలు చూసిన పలువురు నెటిజన్లు ఇది నిజమేనా? లేదా సినిమా ప్రచారమా? అని సందేహాలు వ్యక్తం చేశారు. ఇటీవల ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న నరేశ్.. పెళ్లి వార్తలపై స్పందిస్తూ త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తానన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ‘మళ్ళీ పెళ్లి’ పోస్టర్ షేర్ చేయడంతో ఇప్పటివరకూ జరిగిందంతా సినిమా ప్రమోషనే అయి ఉండొచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
BJP: ‘మోదీ.. ది బాస్’ అంటే రాహుల్ జీర్ణించుకోవట్లేదు: భాజపా కౌంటర్
-
General News
Bopparaju: నాలుగో దశ ఉద్యమం మా చేతుల్లో ఉండదు: బొప్పరాజు
-
Movies News
Ugram OTT Release: ఓటీటీలోకి నరేశ్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
General News
APPSC: త్వరలో గ్రూప్ -1, గ్రూప్-2 నోటిఫికేషన్లు: గౌతమ్ సవాంగ్
-
Movies News
Aamir Khan: ప్రస్తుతానికి సినిమాలు చేయాలని లేదు.. ఎందుకంటే: ఆమిర్ ఖాన్
-
Sports News
IPL 2023: యువకులు కాదు.. యమడేంజర్లు!