Cinema News: ఊరి సమస్యను తీర్చే సినీ నటి

జో శర్మ ప్రధాన పాత్రలో శుభాకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘నర్మద’. ఎమ్‌.ఆర్‌.సి చౌదరి, ఆళ్ల రాఘవ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా బుధవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా

Updated : 14 Apr 2022 09:14 IST

జో శర్మ ప్రధాన పాత్రలో శుభాకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘నర్మద’. ఎమ్‌.ఆర్‌.సి చౌదరి, ఆళ్ల రాఘవ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా బుధవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి మోహన్‌ వడ్లపట్ల క్లాప్‌ కొట్టగా.. కాదంబరి కిరణ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ముప్పలనేని శివ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘కొత్తదనం నిండిన కథతో ఈ సినిమా రూపొందిస్తున్నాం’’ అన్నారు. ‘‘కథ చాలా ఆసక్తికరంగా ఉంది. నేనిందులో టైటిల్‌ పాత్ర పోషిస్తున్నా’’ అంది నటి జో శర్మ. నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘నర్మదా అనే అమ్మాయి తన ఊరిలో జరుగుతున్న అన్యాయాల్ని ఎదిరించాలనుకుంటుంది. కానీ, అందుకు తన స్థాయి సరిపోదని చిత్ర రంగంలోకి వచ్చి స్టార్‌ నాయికగా ఎదుగుతుంది. ఆ తర్వాత ఊరి సమస్యని ఎలా పరిష్కరించింది? ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది చిత్ర కథాంశం. ఈనెల 20నుంచి రాజమండ్రిలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. రెండో షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ఉంటుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో జెమిని రమేష్‌, పద్మిని నాగవల్లి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని