Bollywood: ఆస్పత్రిలో చేరిన నసీరుద్దీన్ షా

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు నసీరుద్దీన్‌ షా ఆస్పత్రిలో చేరారు. గత కొంతకాలం నుంచి న్యుమోనియాతో ఇబ్బందిపడుతున్న ఆయన రెండు రోజుల క్రితమే ఆస్పత్రిలో చేరినట్లు నటుడి...

Published : 01 Jul 2021 01:21 IST

ముంబయి: బాలీవుడ్‌ ప్రముఖ నటుడు నసీరుద్దీన్‌ షా ఆస్పత్రిలో చేరారు. గత కొంతకాలం నుంచి న్యుమోనియాతో ఇబ్బందిపడుతున్న ఆయన రెండు రోజుల క్రితమే ఆస్పత్రిలో చేరినట్లు నటుడి సన్నిహితులు తెలిపారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు. నసీరుద్దీన్‌ ఆస్పత్రిలో ఉన్నారంటూ వార్తలు బయటకు రావడంతో పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు.. ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు.

‘నిషాంత్‌’ అనే చిత్రంతో మొదటి సారి నసీరుద్దీన్‌ నటుడిగా వెండితెరపై మెరిశారు. అనంతరం ఆయన ‘చక్ర’, ‘బజార్‌’, ‘హోళీ’, ‘మిర్చ్‌ మసాలా’, ‘కర్మ’, ‘సర్‌’, ‘హిమ్మత్‌’, ‘బొంబాయి బాయ్స్‌’ వంటి ఎన్నో సినిమాల్లో నసీరుద్దీన్‌ కీలకపాత్రలు పోషించారు. ఆయన కేవలం హిందీలోనే కాకుండా కన్నడ, మలయాళం, బెంగాళీ సినిమాల్లోనూ నటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని