‘నాట్యం’ టీజర్‌ వచ్చేసింది..!

ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్‌, నటి సంధ్యారాజు కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం ‘నాట్యం’. రేవంత్‌ కోరుకొండ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ను బుధవారం తారక్‌ సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు...

Published : 10 Feb 2021 10:52 IST

చిత్రబృందానికి ఎన్టీఆర్‌ శుభాకాంక్షలు

హైదరాబాద్‌: ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్‌, నటి సంధ్యారాజు కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం ‘నాట్యం’. రేవంత్‌ కోరుకొండ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ను బుధవారం తారక్‌ సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. సంధ్యారాజు, ఆమె టీమ్‌కు బెస్ట్‌ విషెస్‌ తెలిపారు. ‘ఒక కథను వింటాం కదా. అదే కథను కళ్లకు చూపిస్తే దాన్ని నాట్యం అంటాం. నాట్యం అంటే ఒక కథను అందంగా చెప్పడం’ అంటూ ఆదిత్య మేనన్‌ చెప్పే డైలాగ్‌లతో ప్రారంభమైన టీజర్‌లోని ప్రతి సన్నివేశం ఆకట్టుకునేలా ఉంది.

ఇదీ చదవండి

నా నటన చూసి ఏడ్చేశారు: కృతిశెట్టి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని