Navdeep: ఎవరీ ‘లవ్‌ మౌళి’?

నవదీప్‌ కథానాయకుడిగా నైరా క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్‌ మౌళి’. ఫంకూరీ గిద్వానీ కథానాయిక. అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్‌రెడ్డి తాటికొండ నిర్మాత. బుధవారం నవదీప్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా

Updated : 27 Jan 2022 07:14 IST

వదీప్‌ కథానాయకుడిగా నైరా క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్‌ మౌళి’. ఫంకూరీ గిద్వానీ కథానాయిక. అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్‌రెడ్డి తాటికొండ నిర్మాత. బుధవారం నవదీప్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌  లుక్‌ని విడుదల చేశారు దర్శకనిర్మాతలు. ‘‘నవదీప్‌ 2.0గా ఆయన్ని కొత్తగా పరిచయం చేసే చిత్రమిది.నవదీప్‌ వేషధారణ, ఆయన హావభావాలు ఇందులో కొత్తగా ఉంటాయి. లవ్‌ మౌళి ఎవరు? అతని కథేమిటన్నది తెరపైనే చూడాలి. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తామ’’ని తెలిపాయి సినీ వర్గాలు. ఈ చిత్రానికి దర్శకత్వంతోపాటు... కెమెరా, ఎడిటింగ్‌ బాధ్యతల్నీ అవనీంద్రే నిర్వర్తిస్తున్నారు. గోవింద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని