
Navdeep: పెళ్లి చేసుకోమంటూ నెటిజన్ల సలహా.. కౌంటర్ ఇచ్చిన నవదీప్
హైదరాబాద్: హీరో, సహనటుడు, వ్యాఖ్యాతగా ప్రేక్షకుల్ని అలరించిన నటుడు నవదీప్. ఒకప్పుడు లవర్‌బాయ్ రోల్స్‌లో నటించి మెప్పించిన ఆయన ఇప్పుడు సహాయనటుడిగా ఆకట్టుకుంటున్నారు. గత కొంతకాలం నుంచి సినిమాలకు కాస్త దూరంగా ఉన్న ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఆద్యంతం ఆస్వాదిస్తున్నారు. ఇష్టమైన ప్రాంతాలకు వెళ్లడం, వర్కౌట్లు, లాంగ్ డ్రైవ్స్, పెట్స్‌తో సరదాగా ఆడుకోవడం.. ఇలా తనకిష్టమైన వ్యాపకాలతో కాలాన్ని గడిపేస్తున్నారు. ఇదిలాఉండగా నవదీప్ పెళ్లి కోసం పలువురు నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 35 ఏళ్లు వచ్చాయి పెళ్లి చేసుకోండంటూ నెటిజన్లు తరచూ ఆయనకి సలహాలిస్తున్నారు.
నెటిజన్ల నుంచి వస్తోన్న పెళ్లి కామెంట్లపై తాజాగా నవదీప్ స్పందించారు. పెళ్లి చేసుకోమంటూ ఉచిత సలహాలు ఇస్తున్న వారికి ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈమేరకు ఆదివారం ఆయన.. ‘‘వద్దురా సోదరా’’ అంటూ వీడియో షేర్ చేశారు. ‘‘అన్నా నీ గడ్డం తెల్లబడుతోంది త్వరగా పెళ్లి చేసుకో అని కొంతమంది నాకు సలహాలు ఇస్తున్నారు. గడ్డం తెల్లబడితే చేయాల్సింది ట్రిమ్మింగ్.. పెళ్లి కాదు. దురద పుడితే గోక్కుంటాం కానీ తోలు పీకేసుకోం కదా..!’’ అని నవదీప్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.