Published : 12 Sep 2020 18:53 IST

డ్రగ్స్‌ కేసు.. నాకేం బాధలేదు: నవదీప్‌

నెటిజన్‌ కామెంట్‌కు నటుడి రిప్లై

హైదరాబాద్‌: బాలీవుడ్‌ స్టార్‌ సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మరణం తర్వాత చిత్ర పరిశ్రమలో డ్రగ్స్‌ అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. ఆయన అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి డ్రగ్స్‌ కోణం బయటపడటంతో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌బీసీ) అధికారులు రియా చక్రవర్తితోపాటు ఆమె సోదరుడిని కూడా అరెస్టు చేశారు. విచారణ క్రమంలో రియా 25 మంది ప్రముఖుల పేర్లు చెప్పినట్లు పలు వెబ్‌సైట్లు కథనాలు రాశాయి.  రకుల్‌ప్రీత్‌ సింగ్‌,  సారా అలీ ఖాన్‌, ముఖేష్‌ చబ్రా పేర్లను కూడా ఆమె బయటపెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రకుల్‌, రియా కలిసి ఉన్న ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దాదాపు 30 వేల ట్వీట్లతో RakulPreetSingh అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది.

ఈ నేపథ్యంలో ఓ నెటిజన్‌.. ‘ఇది మళ్లీ టాలీవుడ్‌కు యూటర్న్‌ తీసుకుంది. నవదీప్‌ అన్న మనకి ఈ బాధలు తప్పేలా లేవు. కొంచెం జాగ్రత్త’ అని వెటకారంగా నవ్వుతున్న ఎమోజీలు షేర్‌ చేశారు. దీన్ని చూసిన నవదీప్‌ గట్టిగా సమాధానం ఇచ్చారు. ‘నాకు ఏం బాధ లేదు బ్రదర్‌.. నువ్వు కూడా బాధపడకు. పద పనికొచ్చే పనులు చేద్దాం’ అని రిప్లై ఇచ్చారు.

సుశాంత్‌కి తాను మత్తు పదార్థాలను సరఫరా చేసేదాన్నని ఇప్పటికే రియా విచారణలో ఒప్పుకున్నారు. తాజా సమాచారం ప్రకారం.. 14 రోజుల కస్టడీలో ఉన్న రియా 20 పేజీల వివరణాత్మక స్టేట్‌మెంట్‌ను ఎన్‌సీబీకి అందించారు. బాలీవుడ్‌లో మాదకద్రవ్యాల సరఫరా, కొనుగోలు చేసే 25 మంది సెలబ్రిటీల పేర్లను అందులో వెల్లడించినట్లు తెలుస్తోంది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని