Published : 18 Aug 2022 15:12 IST

Naveen Chandra: డైరెక్ట్‌ ఓటీటీలోకి వస్తోన్న నవీన్‌ చంద్రా కొత్త సినిమా

హైదరాబాద్‌: కెరీర్‌ ఆరంభంలో ప్రేమికుడి పాత్రల్లో నటించి మెప్పించిన నటుడు నవీన్‌ చంద్రా ఇప్పుడు సీరియస్‌ పాత్రల్లో అలరిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల ‘పరంపర’ సిరీస్‌లో సీరియస్‌ రోల్‌ పోషించిన ఆయన తాజాగా నటిస్తోన్న చిత్రం ‘రిపీట్‌’. అలనాటి నటి మధు కీలకపాత్ర పోషించిన ఈ సినిమా త్వరలో డిస్నీ ఫ్లస్‌ హాట్‌ స్టార్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం తాజాగా ‘రిపీట్‌’ ట్రైలర్‌ని ప్రేక్షకులతో పంచుకుంది. ఇందులో నవీన్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నారు. ‘‘గేమ్‌ మొదలుపెట్టిన ఫస్ట్‌ మూవ్‌లోనే ఒకడు మనకి చెక్‌ పెడితే ఎలా ఉంటుందో అలా ఎదురైంది నాకీ కేసు. ప్రతి స్టెప్పులోనూ నాకు చెక్‌ పెడుతూనే వచ్చాడు’’ అంటూ నవీన్‌ చెప్పే డైలాగ్‌లతో సాగే ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్‌లోని సన్నివేశాలను చూస్తే..  సస్పెన్స్‌ క్రైమ్‌ కథతో ఇది రూపుదిద్దుకొన్నట్లు అర్థమవుతోంది. ఆగస్టు 25 నుంచి ఇది ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని