Naveen Polishetty: ఆ ఫొటోలు చూసి కత్రినా-విక్కీ కుళ్లుకోవాలి!

‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన యువ కథానాయకుడు నవీన్‌ పొలిశెట్టి.

Updated : 16 Jan 2022 16:41 IST

హైదరాబాద్‌: ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యువ కథానాయకుడు నవీన్‌ పొలిశెట్టి. ఆయన కథానాయకుడిగా కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘అనగనగా ఒక రాజు’ అంటూ విడుదల చేసిన ఈ వీడియోలో నవీన్‌ హంగామా నవ్వులు పంచుతోంది. ‘నేను చెప్పకూడదు కానీ, ఈ దశాబ్దంలో అలరించే కార్యక్రమం ఇదే. థియేటర్లలో మీరే చూస్తారుగా’ అంటూ నవీన్‌ పలికిన సంభాషణలు అలరిస్తున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతమందిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని