Naveen Polishetty: ఇప్పుడు నేను ఒంటరినని అనుకోవడం లేదు: నవీన్‌ పొలిశెట్టి

జోగిపేట్‌ శ్రీకాంత్‌గా కడుపుబ్బా నవ్వించి, తన నటన, కామెడీ టైమింగ్‌తో అందర్నీ మెప్పించి బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌ని అందుకున్న నటుడు నవీన్‌ పొలిశెట్టి. ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన ‘జాతిరత్నాలు’తో రెండో సినిమాకే....

Published : 12 Mar 2022 01:26 IST

హైదరాబాద్‌: జోగిపేట్‌ శ్రీకాంత్‌గా కడుపుబ్బా నవ్వించి, తన నటన, కామెడీ టైమింగ్‌తో అందర్నీ మెప్పించి బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌ని అందుకున్న నటుడు నవీన్‌ పొలిశెట్టి. ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన ‘జాతిరత్నాలు’తో రెండో సినిమాకే సూపర్‌ క్రేజ్‌ పొందారు. అనుదీప్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలై శుక్రవారం నాటికి సంవత్సరమైంది. దీంతో ‘జాతిరత్నాలు’ టీమ్‌ కోసం పనిచేసిన వారందరూ ఆ సినిమా విడుదలైన రోజుని గుర్తు చేసుకున్నారు. సోషల్‌మీడియా వేదికగా ప్రేక్షకులందరికీ థ్యాంక్స్‌ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

ఈ క్రమంలో నవీన్‌ పొలిశెట్టి తన పోస్టులో.. ‘‘బ్లాక్‌బస్టర్‌ ‘జాతిరత్నాలు’ విడుదలై సంవత్సరమైంది. ఈ సినిమా విడుదలయ్యే సమయానికి వ్యాక్సినేషన్‌ ప్రారంభం కాలేదు. కరోనా కారణంగా అప్పటికే చాలావరకూ థియేటర్లలన్నీ మూతపడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో మా సినిమా విడుదలైంది. ఆ సమయంలో ప్రేక్షకులు మాపై చూపించిన ప్రేమాభిమానాలు మర్చిపోలేను. అందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీరు నాపై చూపిస్తున్న అభిమానాన్ని దృష్టిలో ఉంచుకుని మిమ్మల్ని మరింత ఎంటర్‌టైన్‌ చేయడానికి కష్టపడి పనిచేస్తా. ‘‘బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఒక్కడివే ఎలా రా ఇండస్ట్రీలో..’’ అంటూ మా నాన్న నాతో చెప్పిన మాట ఎప్పటికీ మర్చిపోను. కానీ, ఈ రోజు మీ అందర్నీ చూస్తుంటే నేను ఒంటరినని అనుకోవడం లేదు. ‘‘తెలుగు ప్రేక్షకులంతా మనతో ఉన్నారు’’ అనే ధైర్యం ఉంది. మానసికంగా నిరాశకు గురైనప్పుడు మా సినిమా తమలో ఎంతో ఆనందాన్ని నింపిందని ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు మాకు సందేశాలు పంపుతున్నారు. మా సినిమా మీ జీవితాల్లో ఇలాగే నవ్వులు పూయించాలని కోరుకుంటున్నా ’’ అని నవీన్‌ పేర్కొన్నారు.



Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని