సీఎం గారూ.. అభిప్రాయం మార్చుకోండి: నవ్య

రిప్డ్‌ జీన్స్‌ గురించి ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి తీరత్‌ సింగ్‌ రావత్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మహిళలు టోన్డ్‌ జీన్స్‌ ధరించి సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారు?...

Updated : 18 Mar 2021 17:33 IST

ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై బిగ్‌బి మనవరాలు అసంతృప్తి

ముంబయి: రిప్‌డ్‌‌ జీన్స్‌ గురించి ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి తీరథ్‌ సింగ్‌ రావత్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మహిళలు టోర్న్‌‌ జీన్స్‌ ధరించి సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారు? అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల బిగ్‌బి మనవరాలు నవ్య నవేలి నందా అసంతృప్తి వ్యక్తం చేశారు. టోర్న్‌‌ జీన్స్‌ ధరించిన ఓ ఫొటోని ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసిన నవ్య... అలాంటి దుస్తులు వేసుకోవడాన్ని తాను గర్వంగానే ఫీల్‌ అవుతానని తెలిపారు. అనంతరం సీఎం వ్యాఖ్యల గురించి స్పందిస్తూ.. ‘మా వస్త్రధారణను మార్చడానికంటే ముందు మీ అభిప్రాయాలు, ఆలోచనా విధానాన్ని మార్చుకోండి. మీ వ్యాఖ్యల నుంచి సమాజంలోకి వెళ్లే సందేశాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి’ అని నవ్య ఇన్‌స్టాలో పేర్కొంది. తర్వాత కొద్దిసేపటికే ఆ పోస్ట్‌ను డిలీట్‌ చేశారు. కాకపోతే అప్పటికే నవ్య పోస్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఇటీవల ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తీరథ్‌‌ సింగ్‌ రావత్‌ మంగళవారం దేహ్రాదూన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మహిళల వస్త్రధారణపై కామెంట్లు చేశారు. గత కొంతకాలం క్రితం ఓసారి విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో తన పక్కన కూర్చొన్న ఓ మహిళ రిప్‌డ్‌‌ జీన్స్‌ ధరించిందని, ఆమెకు ఇద్దరు పిల్లలున్నారని, ఆమె ఒక ఎన్‌జీవోని సైతం నడుపుతోందని.. ఇలాంటి దుస్తులు ధరించి సభ్య సమాజానికి ఏం సందేశం మెసేజ్‌ ఇస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరలేపడంతో పలువురు స్పందించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే నవ్య ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పోస్ట్‌ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని