మాజీ భార్యపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన నటుడు

నవాజుద్దీన్‌ సిద్దిఖీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన మాజీ భార్య, సోదరుడిపై పరువు నష్టం దావా వేశారు.

Published : 26 Mar 2023 23:04 IST

ముంబయి: తన మాజీ సతీమణి అంజనా పాండే, సోదరుడు షంసుద్దీన్‌పై పరువు నష్టం దావా వేశారు బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీ (Nawazuddin Siddiqui). వారిద్దరూ తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని, అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ఆయన వెల్లడించారు. ఈ మేరకు బాంబే హైకోర్టును ఆశ్రయించిన ఆయన.. వారిద్దరూ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, అలాగే, తన గౌరవానికి భంగం కలిగించేలా ఎలాంటి పోస్టులు, కామెంట్స్ చేయకూడదని, ఇప్పటివరకూ సోషల్‌మీడియాలో పెట్టిన పోస్టులన్నింటినీ తొలగించాలని పిటిషన్‌లో కోరారు. అంతేకాకుండా, 2008 నుంచి షంసుద్దీన్‌ తనకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్నాడని.. తన అకౌంట్స్‌ అన్నీ చూసుకునే వాడని.. ఆ సమయంలోనే ఆర్థికంగా మోసం చేశాడని.. అక్రమంగా ఆస్తులు కొనుగోలు చేశాడని.. వాటిని తిరిగి ఇప్పించమని నవాజుద్దీన్‌ పేర్కొన్నారు. మార్చి 30న ఈ కేసుపై విచారణ జరగనుంది.

ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి బాలీవుడ్‌ (Bollywood)లో విలక్షణ నటుడిగా నవాజుద్దీన్‌ సిద్ధిఖీ (Nawazuddin Siddiqui) పేరు తెచ్చుకున్నారు. దీంతో ఆయన దక్షిణాది వారికీ చేరువయ్యారు. అయితే, నవాజుద్దీన్‌ మంచి వాడు కాదంటూ ఆయన సతీమణి గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్నారు. ఫేమ్‌ వచ్చాక అతడు పూర్తిగా మారిపోయాడని.. మానవత్వం మరిచిపోయాడని ఆమె అన్నారు. తనకి విడాకులు ఇవ్వకుండానే.. ఇచ్చేశానని అందరికీ చెబుతున్నాడని ఆరోపించారు. ఈ క్రమంలోనే నవాజుద్దీన్‌ సోదరుడు షంసుద్దీన్‌ సైతం ఇదే విధమైన ఆరోపణలు చేశాడు. నవాజుద్దీన్‌కు వ్యతిరేకంగా సోషల్‌మీడియాలోనూ వీరిద్దరూ వరుస పోస్టులు పెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని