Nayanthara: టాక్సిక్‌ కోసం బరిలోకి నయనతార

‘కేజీఎఫ్‌’ సిరీస్‌ విజయాల తర్వాత యశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘టాక్సిక్‌’. గీతూ మోహన్‌దాస్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

Published : 16 Jun 2024 01:26 IST

కేజీఎఫ్‌’ సిరీస్‌ విజయాల తర్వాత యశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘టాక్సిక్‌’. గీతూ మోహన్‌దాస్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. నయనతార, హ్యూమా ఖురేషి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం యశ్‌తో కలిసి నయన్‌ సెట్లోకి అడుగు పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం వీళ్లిద్దరిపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దీని తర్వాత రెండో షెడ్యూల్‌ను యూకేలో చిత్రీకరించనున్నారని తెలిసింది. ఈ సినిమాలో సింహభాగం అక్కడే చిత్రీకరణ చేసుకోనుందని.. దీనికోసం దాదాపు 150రోజులకు పైగా సుదీర్ఘ షెడ్యూల్‌ను ప్లాన్‌ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. విజయవంతమైన ఆంగ్ల సిరీస్‌ ‘పీకీ బ్లైండర్స్‌’ ప్రేరణతో గీతూ ఈ కథను సిద్ధం చేసినట్లు ప్రచారం వినిపిస్తోంది. ఈ చిత్రంలో యశ్‌ శక్తిమంతమైన గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు జోడీగా కియారా నటించనున్నట్లు తెలిసింది. ఇది వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని