Nayanthara: నయన్‌ విశ్వరూపం ఒక్క వీడియోలో! 

లవ్‌, క్రైమ్‌, థ్రిల్లర్‌, డ్రామా.. ఇలా నేపథ్యం ఏదైనా, పాత్ర ఎలాంటిదైనా సరే తనదైన మార్క్‌ చూపిస్తుంది నయనతార. అందుకే అందరూ ఆమెని లేడీ సూపర్‌స్టార్‌గా అభివర్ణిస్తారు.

Published : 08 Jul 2021 02:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లవ్‌, క్రైమ్‌, థ్రిల్లర్‌, డ్రామా.. ఇలా నేపథ్యం ఏదైనా, పాత్ర ఎలాంటిదైనా సరే తనదైన మార్క్‌ చూపిస్తుంది నయనతార. అందుకే అందరూ ఆమెని లేడీ సూపర్‌స్టార్‌గా అభివర్ణిస్తారు. ఆమె నటించిన పలు సూపర్‌ హిట్‌ చిత్రాలు ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. వాటిల్లోని కొన్ని సన్నివేశాలతో ‘ది బెస్ట్‌ ఆఫ్‌ నయనతార మూవీస్‌’ పేరుతో ఓ వీడియోను బుధవారం విడుదల చేసింది అమెజాన్‌ సంస్థ. ‘విశ్వాసం’, ‘ఐరా’, ‘కొలైయుతిర్‌ కాలమ్‌’, ‘నిజల్‌’, ‘ఇమైక్కా నొడిగల్‌’ చిత్రాల్లోని నయన్‌ నట విశ్వరూపాన్ని ఈ ఒక్క వీడియోలో చూడొచ్చు. ప్రతి సీన్‌లోనూ ఆమె పలికించిన హావభావాలు ఆకట్టుకున్నాయి. ఇంకెందుకు ఆలస్యం నయనతార నటనని మరోసారి చూసి ఎంజాయ్‌ చేయండి.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని