Nayanthara: నయన్‌-విఘ్నేశ్‌ లవ్‌, వెడ్డింగ్‌ డాక్యుమెంటరీ.. టీజర్‌ చూశారా?

అగ్రకథానాయిక నయనతార (Nayanthara), దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ (Vignesh Shivan) ప్రేమ, పెళ్లి డాక్యుమెంటరీగా రూపొందుతున్న

Updated : 24 Sep 2022 17:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అగ్రకథానాయిక నయనతార (Nayanthara), దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ (Vignesh Shivan) ప్రేమ, పెళ్లి డాక్యుమెంటరీగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. దీనిని ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీటేల్‌’ పేరుతో తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన టీజర్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ విడుదల చేసింది. ఈ డాక్యుమెంటరీలో నయన్‌-విఘ్నేష్‌లు కలిసి ఉన్న మధుర ఘట్టాలతో పాటు, పలు ప్రశ్నలకు ఇరువురు సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. నయనతార ఎందుకు? అని విఘ్నేష్‌ను ప్రశ్నించగా, ‘ఏంజెలినా జోలీ కూడా అడిగింది. కాకపోతే ఆమె దక్షిణభారత దేశానికి చెందిన అమ్మాయి కాకపోవడంతో ఒప్పుకోలేదు’ అన్నట్లు నవ్వుతూ విఘ్నేష్‌ సమాధానం ఇచ్చారు. నటికన్నా కూడా నయన్‌ మంచి మనిషి అని, అంటూ విఘ్నేష్‌ చెప్పుకొచ్చారు. అలాగే ‘ఇది ఎప్పుడు మొదలైందో ఐడియా కూడా లేదు. నేనేమీ ఫిల్మ్‌ కిడ్‌ను కాదు. ఒక సాధారణ అమ్మాయిని. అలాంటి అమ్మాయి 100శాతం ఏం ఇవ్వగలదో నేనూ అదే ఇస్తా’ అని నయన్‌ అన్నారు.

సుమారు ఏడేళ్లపాటు ప్రేమలో ఉన్న నయనతార-విఘ్నేశ్‌ శివన్‌ పెద్దల అంగీకారంతో కొన్నిరోజుల కిందట వివాహబంధంలోకి అడుగుపెట్టారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో జూన్‌ 9న ఈ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన అగ్రతారాలోకం సమక్షంలో జరిగిన ఈ వేడుక ఫుటేజీ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. ఈ మేరకు త్వరలోనే ఆ వాళ్లిద్దరి లవ్‌ స్టోరీ, పెళ్లి వీడియోని ఆ సంస్థ.. తమ ఫ్లాట్‌ఫామ్‌ వేదికగా ప్రసారం చేయనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని