Godfather: ‘గాడ్‌ ఫాదర్‌’ కోసం నయనతార ఆ కండీషన్‌ పెట్టిందా?

చిరంజీవి కథానాయకుడి మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘గాడ్‌ ఫాదర్‌’. మలయాళంలో

Published : 16 Nov 2021 17:35 IST

హైదరాబాద్‌: చిరంజీవి కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘గాడ్‌ ఫాదర్‌’. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్’ రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మలయాళంలో మంజు వారియర్‌ పాత్రను తెలుగులో నయన్‌, ఆమె భర్తగా వివేవ్‌ ఒబెరాయ్‌ పాత్రను సత్యదేవ్‌ పోషిస్తున్నారు. అయితే, ఈ విషయమై నయన్‌ ఒక కండీషన్‌ పెట్టినట్లు తెలుస్తోంది.

తన భర్త పాత్రలో గుర్తింపు ఉన్న నటుడిని కాకుండా యువ కథానాయకుడిని పెట్టడం పట్ల ఆమె అసంతృప్తితో ఉన్నారట. తనకు జోడీగా నటించేంత పాపులారిటీ ఆయనకు లేదు కదా! అన్నట్లు సమాచారం. దీనిపై చిత్ర బృందం స్పందిస్తూ, చిరంజీవి తర్వాత అనుకున్న ముఖ్య పాత్రల్లో సత్యదేవ్‌ కూడా ఉన్నారని, ఇప్పుడు మార్చడం సాధ్యమయ్యే పని కాదని ఆమెతో అన్నట్లు తెలిసింది. ఎందుకంటే తొలి నుంచి విభిన్న పాత్రలతో సత్యదేవ్‌ మెప్పిస్తున్నారు. ఇదే విషయాన్ని కూడా నయన్‌ వద్ద ప్రస్తావించారట. వివేక్‌ పాత్రకు సత్యదేవ్‌ న్యాయం చేస్తారని దర్శకుడు మోహన్‌రాజా గట్టిగా నమ్ముతున్నారని చిత్ర బృందం భావిస్తోంది. మరి వెండితెరపై నయన్‌-సత్యదేవ్‌ల జోడీ ఎలా ఉంటుందో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని