Nayanthara: నేనూ క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా.. నయనతార షాకింగ్ కామెంట్స్
సుమారు 20 సంవత్సరాలుగా సినీ ప్రియులను అలరిస్తోన్నారు అగ్రకథానాయిక నయనతార (Nayanthara). వివాహమైన తర్వాత కూడా వరుస సినిమాల్లో నటిస్తోన్న ఆమె తాజాగా క్యాస్టింగ్ కౌచ్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇంటర్నెట్‌డెస్క్: సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ (Casting Couch) ఉందంటూ అగ్రకథానాయిక నయనతార (Nayanthara) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమయంలో తానూ క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నానంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తనకు ఓ భారీ ప్రాజెక్ట్‌లో కీలకపాత్ర పోషించే అవకాశం వచ్చిందని.. అందులో నటించాలంటే తమకు నచ్చినట్టుగా ఉండాలని, వాళ్లు అడిగింది చేయాలని కోరారని నయన్ తెలిపారు.
అయితే, తన టాలెంట్‌పై ఉన్న నమ్మకంతో ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు నయన్ చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అంతటా చర్చనీయాంశంగా మారాయి. క్యాస్టింగ్ కౌచ్‌పై ఇప్పటికే పలువురు నటీమణులు సోషల్‌మీడియాలో తమ గళాన్ని విప్పిన విషయం తెలిసిందే. ఇక సినిమాల విషయానికొస్తే.. నయనతార నటించిన ‘కనెక్ట్’ గతేడాది విడుదలైంది. విరామమే లేని చిత్రంగా విడుదలైన ఇది మంచి టాక్‌ను అందుకుంది. ప్రస్తుతం ఆమె ‘జవాన్’ కోసం పనిచేస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో షారుఖ్ హీరోగా ఇది తెరకెక్కుతోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
పింఛను కోసం 15 ఏళ్ల పాటు అంధురాలిగా నటన
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Gas Cylinder : తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర
-
Politics News
Rahul Gandhi : నేడో, రేపో ‘రాహుల్ పిటిషన్’!
-
India News
Punjab: గుర్రాల పెంపకంతో భలే ఆదాయం
-
India News
Digital Water Meters: అపార్ట్మెంట్లలో డిజిటల్ వాటర్ మీటర్లు