Nayanthara: ఆ సినిమా అంగీకరించడం.. నా జీవితంలో తీసుకున్న చెత్త నిర్ణయం

‘గజిని’ సినిమాను అంగీకరించడం తన జీవితంలో తీసుకున్న చెత్త నిర్ణయమని నయనతార అన్నారు. దానికి గల కారణాన్ని వివరించారు.

Published : 19 Jun 2024 16:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సూర్య హీరోగా ఏఆర్‌ మురుగదాస్‌ తెరకెక్కించిన చిత్రం ‘గజిని’. 2005లో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచి.. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇందులో అసిన్‌ కథానాయికగా నటించగా నయనతార (Nayanthara) కీలకపాత్రలో కనిపించారు. అయితే, ఈ సినిమా (Ghajini) గురించి నయనతార గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దీన్ని అంగీకరించడం తన జీవితంలో తీసుకున్న చెత్త నిర్ణయమన్నారు.

‘‘గజిని’లో నా పాత్రను కథ వివరించేటప్పుడు చెప్పిన విధంగా తెరకెక్కించలేదు. ఫొటోలను భిన్నంగా చూపించారు. అందుకే ఈ సినిమా ఓకే చేయడం నేను తీసుకున్న చెత్తనిర్ణయమని అంగీకరిస్తాను. ఈ విషయంలో ఎవరినీ నిందించాలని అనుకోవడం లేదు. ఎందుకంటే ఇలాంటి వాటిని గుణపాఠంగా స్వీకరిస్తాను’’ అని తెలిపారు. సూర్య (Suriya) హీరోగా తెరకెక్కిన ఇదే చిత్రాన్ని మురుగదాస్‌ హిందీలో ఆమిర్‌ ఖాన్‌తో రూపొందించారు. 2008లో విడుదలై అక్కడ కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది. నయనతార నటించిన పాత్రను హిందీలో జియా ఖాన్‌ పోషించారు. ఈ విషయంపై మురుగదాస్‌ మాట్లాడుతూ..  ‘సినిమా కోసం ఎవరి పాత్రను ప్రత్యేకంగా రాయలేదు. ఒక్కోసారి పెద్ద హీరోయిన్లకు కూడా నిడివి తక్కువ ఉన్న పాత్రలు రాయాల్సి వస్తుంది. అది మన చేతుల్లో లేదు’ అని సమాధానమిచ్చారు.

మీకు కమెడియన్‌గా అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది: హరీశ్‌ శంకర్‌

‘గజిని’ విడుదలైన 15 ఏళ్ల తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో నయనతార నటించారు. రజనీకాంత్‌ హీరోగా వచ్చిన ‘దర్బార్‌’లో ఆమె ప్రధానపాత్రలో కనిపించారు. 2020లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా ఇది రికార్డు నెలకొల్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని