Nayanthara: మీ విమర్శలూ స్వీకరిస్తున్నాం: నయనతార
‘కనెక్ట్’ సినిమాపై ప్రేక్షకులు చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు చెప్పారు అగ్రకథానాయిక నయనతార. సినీ ప్రియుల అభిప్రాయాన్ని తాను గౌరవిస్తానని అన్నారు.
చెన్నై: నయనతార (Nayanthara) ప్రధాన పాత్రలో నటించిన హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ ‘కనెక్ట్’ (Connect). అశ్విన్ శరవణన్ దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో నయన్ శుక్రవారం ఓ లేఖను విడుదల చేశారు. తమ సినిమాపై ప్రేమాభిమానాన్ని చూపించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. అంతేకాకుండా విమర్శలనూ తాను స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
‘‘ఈ ఏడాది నాకెన్నో ఆనందాలను అందించింది. కృతజ్ఞతా భావంతో ఇది నిండింది. మా ‘కనెక్ట్’ చిత్రాన్ని వీక్షిస్తూ, మమ్మల్ని సపోర్ట్ చేస్తోన్న సినీ ప్రియులకు ధన్యవాదాలు. హారర్ జోనర్‌లో దీన్ని మరింత విభిన్నంగా తీర్చిదిద్దేందుకు మేము ఎంతగానో శ్రమించాం. సినిమా విషయంలో నన్ను నమ్మి, ప్రతి క్షణం నాకు అండగా ఉన్న దర్శకుడు అశ్విన్‌కు ధన్యవాదాలు. ఆయన సినిమాలు తెరకెక్కించే విధానం అద్భుతంగా ఉంటుంది. ఆయనతో మరెన్నో చిత్రాలు చేయాలని ఉంది. ఇక, నిర్మాత విఘ్నేశ్ శివన్, రౌడీ పిక్చర్స్ బృందానికి ధన్యవాదాలు’’ అని తెలిపారు. అనంతరం సినీ ప్రియుల్ని ఉద్దేశిస్తూ.. ‘‘మీరు ప్రేమ, అభిప్రాయం, విమర్శలనూ మేము అంగీకరిస్తున్నాం. భవిష్యత్తులో తెరకెక్కించే చిత్రాలకు వీటిని అనుభవ పాఠాలుగా భావిస్తున్నాం’’ అని నయన్ రాసుకొచ్చారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
India News
మహిళ గొలుసు మింగేసిన దొంగ.. కాపాడాలని పోలీసులను వేడుకోలు
-
World News
ప్రాణం తీసిన సోషల్ మీడియా సవాల్
-
Politics News
అసెంబ్లీ ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా.. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
-
Crime News
క్షణికావేశంలో ఆలుమగల బలవన్మరణం
-
World News
Pizza: ఇప్పుడు తినండి.. మరణానంతరం చెల్లించండి.. ఓ పిజ్జా కంపెనీ వింత ఆఫర్!