Nayanthara: ‘గాడ్‌ఫాదర్’ సక్సెస్.. స్పెషల్ నోట్ షేర్ చేసిన నయనతార
‘గాడ్‌ఫాదర్’ సక్సెస్‌పై నయనతార స్పందించారు. టీమ్ సభ్యులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెబుతూ ఓ లేఖ విడుదల చేశారు.
హైదరాబాద్: చిరంజీవి - సత్యదేవ్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ‘గాడ్‌ఫాదర్’ సక్సెస్‌పై నయనతార స్పందించారు. పొలిటికల్ డ్రామా తెరకెక్కిన ఈ చిత్రంలో సత్యప్రియగా కీలకపాత్ర పోషించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ మేరకు ఆమె టీమ్‌లో భాగమైన సభ్యులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెబుతూ ఓ లేఖ విడుదల చేశారు.
‘‘గాడ్‌ఫాదర్’కు బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందించిన సినీ ప్రియులు, అభిమానులకు ధన్యవాదాలు. కుటుంబ సభ్యులందరితో కలిసి మీరు ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నందుకు ఆనందిస్తున్నా. ముఖ్యమైన వ్యక్తులు, అద్భుతమైన బృందం వల్ల ఈ సినిమా నాకెంతో ప్రత్యేకంగా మారింది. ‘సైరా’ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. ఆయనొక మంచి వ్యక్తి, గొప్ప నటుడు. సెట్లో ఆయనతో ఉన్న ప్రతిక్షణాన్నీ ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా. సత్యప్రియ వంటి కీలకమైన పాత్రకు నేను ప్రాణం పోయగలనని నమ్మి, మూడోసారి తన సినిమాలో నన్ను భాగం చేసిన మోహన్‌రాజాకు కృతజ్ఞతలు. సల్మాన్‌ఖాన్‌ని అందరూ ఎందుకు ప్రేమిస్తారో ఈ సినిమా తెలియజేస్తుంది. ఈ సినిమా ఇంతటి గొప్ప విజయం సొంతం చేసుకోవడంలో భాగమైన మీకు, నా పాత్ర మరింత అద్భుతంగా వచ్చేందుకు సహకరించిన సహనటులు సత్యదేవ్, తాన్యాకు ధన్యవాదాలు. నిర్మాతలు, ఇతర టెక్నీషియన్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని నయనతార పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
NEET PG exam: నీట్ పీజీ పరీక్ష షెడ్యూల్లో మార్పు వార్తల్ని నమ్మొద్దు: కేంద్రం
-
General News
APSRTC: శ్రీశైలం వెళ్లే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ
-
Sports News
Asia Cup 2023: ‘వారు నరకానికి పోవాలనుకోవడం లేదు’’..: వెంకటేశ్ ప్రసాద్
-
General News
KTR: హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
General News
Supreme Court: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. అత్యవసర విచారణకు సీజేఐకి విజ్ఞప్తి
-
World News
Mumbai terror attacks: 2008 ఉగ్రదాడి గాయం గుర్తులు ఇంకా మానిపోలేదు: అమెరికా