
Nayan Vignesh-Vijay Ananya: ఇక్కడ విఘ్నేశ్-నయన్.. అక్కడ విజయ్-అనన్య
లోకల్ రెస్టారెంట్స్‌లో తారల విందు..
ఇంటర్నెట్‌డెస్క్: షూటింగ్స్ నుంచి ఏ కాస్త విరామం దొరికినా పర్సనల్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటారు మన తారలు. ఇష్టమైన వారితో కలిసి డిన్నర్ డేట్స్.. షాపింగ్స్‌తో సమయాన్ని గడుపుతుంటారు. ప్రస్తుతం మన స్టార్ కపుల్స్ నయనతార-విఘ్నేశ్ శివన్, విజయ్ దేవరకొండ-అనన్యపాండే.. ఫ్రీ టైమ్‌ని సరదాగా గడుపుతున్నారు. డిన్నర్ డేట్స్‌కు వెళ్లి తమకిష్టమైన ఫుడ్‌ని రుచి చూశారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి.
నయన్-విఘ్నేశ్@మహాబలిపురం
‘‘బెస్ట్ లోకల్ ఫుడ్‌ని నాకెంతో ఇష్టమైన నయన్‌కు తినిపించడంలో వచ్చే ఆనందం మరో స్థాయిలో ఉంటుంది’’ అని అంటున్నారు దర్శకుడు విఘ్నేశ్ శివన్. గత కొన్నిరోజుల నుంచి ‘కాతువక్కల రెందు కాదల్’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఈ జంట వర్క్ లైఫ్ నుంచి కాస్త బ్రేక్ తీసుకుంది. తమకిష్టమైన సీఫుడ్ కోసం మహాబలిపురంలోని ‘మూన్రేకర్స్’ రెస్టారెంట్‌కు వెళ్లింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోని విఘ్నేశ్ ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ‘‘ఇష్టమైన ఫుడ్‌ని ఆస్వాదించడానికి సరైన సమయం. మంచి మనుషులు, రుచికరమైన భోజనంతో ఈ ప్రదేశంలోనే మేము ఫుడ్‌ని ఎప్పుడూ ఎంజాయ్ చేస్తుంటాం’’ అని ఆయన రాసుకొచ్చారు. మరోవైపు, నయన్-విఘ్నేశ్ వచ్చే నెల 9న వివాహం చేసుకోనున్నారని సమాచారం. ఈ మేరకు వీరి ఇంట పెళ్లి పనులు ప్రారంభమైనట్లు వార్తలు వస్తున్నాయి.
విజయ్-అనన్య@ముంబయి
నటుడు విజయ్ దేవరకొండ, నటి అనన్యపాండే జంటగా నటించిన చిత్రం ‘లైగర్’. పూరీ జగన్నాథ్ దర్శకుడు. ఛార్మి, కరణ్ జోహర్ నిర్మాతలు. గత కొన్నిరోజుల క్రితం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. మరోవైపు, ‘లైగర్’ షూట్ పూర్తైన వెంటనే విజయ్.. తన తదుపరి చిత్రం ‘ఖుషి’ పనుల్లో బిజీగా ఉన్నారు. సామ్ కథానాయికగా సిద్ధమవుతోన్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కశ్మీర్లో ఇటీవల పూర్తైంది. దీంతో విజయ్ ముంబయికి చేరుకున్నారు. ‘లైగర్’ టీమ్‌ని కలిసి ప్రమోషన్స్ గురించి చర్చించారు. అనంతరం మంగళవారం సాయంత్రం అనన్య, ఛార్మిలతో కలిసి ముంబయిలోని ఓ రెస్టారెంట్‌కు డిన్నర్ డేట్‌కు వెళ్లి వచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
Hyderabad News: రోజూ ‘బయోమెట్రిక్’ వేసి వెళ్తే నెలకు రూ. 15 వేలు!
-
Ap-top-news News
Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
-
Ap-top-news News
Andhra News: కలెక్టరమ్మా... కాలువల మధ్య ఇళ్లు కట్టలేమమ్మా!
-
Crime News
Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు రూ.4.50 లక్షల సుపారీ!
-
General News
Heavy Rains: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- Kaali: ‘కాళీ’ డాక్యుమెంటరీ పోస్టర్ వివాదాస్పదం.. దర్శకురాలిపై మండిపడుతోన్న నెటిజన్లు
- Viral video: రియల్ హీరో.. కరెంటు షాక్‌తో విలవిల్లాడుతున్న ఆవును రక్షించిన యువకుడు
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
- America: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి
- ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తే ఆత్మహత్యలే
- అప్పుల కుప్పతో లంక తిప్పలు