Nayanthara: మలేసియా వీధుల్లో నయన్‌ కుటుంబం సందడి..

నయనతార (Nayanthara) కుటుంబం మలేసియాలో సందడి చేసింది. తనయుల పుట్టినరోజు కోసం అక్కడికి వెళ్లిన నయన్‌ దంపతులు.. తాజాగా కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు.

Updated : 27 Sep 2023 13:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘జవాన్‌’ (Jawan)తో ఈ ఏడాది సూపర్‌ సక్సెస్‌ సొంతం చేసుకున్నారు నటి నయనతార (Nayanthara). తాజాగా ఆమె తన కుటుంబంతో కలిసి మలేసియా వెళ్లారు. తన తనయులు ఉయిర్‌ రుద్రోనీల్‌ ఎన్‌ శివన్‌, ఉలగ్‌ దైవిక్‌ ఎన్‌ శివన్‌ పుట్టినరోజును పురస్కరించుకుని కౌలాలంపూర్‌కు వెళ్లిన నయన్‌ - విఘ్నేశ్‌ దంపతులు.. పెట్రోనాస్ ట్విన్‌ టవర్‌ వద్ద వేడుకలు జరిపారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలను నయన్‌ తాజాగా ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు.

‘‘మై ట్విన్‌ టవర్స్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. చిరునవ్వులు.. సంతోషం.. ఆశీస్సులకు ఏడాది. జీవితంలో మీరు ఎంతో ఎత్తుకు ఎదగాలని.. చుట్టూ ఉన్న వాళ్లకు సంతోషాన్ని అందించాలని కోరుకుంటున్నాం. మీరు మా జీవితాన్ని రంగులమయం చేసి.. వెలుగులు నింపారు. మీతో గడిపే ప్రతిరోజూ మాకొక పండుగలా ఉంటుంది. మీ మొదటి పుట్టినరోజు వేడుకను ఈ ఎత్తైన పవర్‌ఫుల్‌ టవర్స్‌ వద్ద చేయాలని ఎన్నో కలలు కన్నాం. అనుకున్న విధంగా మీ బర్త్‌డేని సెలబ్రేట్‌ చేసినందుకు సంతోషంగా ఉంది’’ అని నయన్‌ పేర్కొన్నారు. ఈ ఫొటోలు చూసిన పలువురు సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ.. ‘‘హ్యాపీ బర్త్‌డే’’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

Leo: ‘లియో’ ఆడియో ఫంక్షన్‌ క్యాన్సిల్‌.. అసలు కారణమిదే..

దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న నయనతార - విఘ్నేశ్‌ శివన్‌ గతేడాది జూన్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులమయ్యామంటూ అక్టోబర్‌ నెలలో తెలిపారు. ఇక, వర్క్ లైఫ్‌ విషయానికి వస్తే నయనతార నటించిన ‘ఇరైవన్‌’ సెప్టెంబర్‌ 28న విడుదల కానుంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా సిద్ధమైన ఈ చిత్రంలో జయం రవి ప్రధాన పాత్ర పోషించారు. నయన్‌ దంపతులు తాజాగా స్కిన్‌కేర్‌ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 9Skin పేరుతో చర్మ సౌందర్య ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకువచ్చారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని