Nayanthara: నిరుపేదలకు స్వయంగా గిఫ్ట్‌లు ఇచ్చిన నయన్‌

నటి  నయనతార ఉదారత చాటుకున్నారు. కొత్త సంవత్సరం వేడుకలను పురస్కరించుకుని నిరుపేదలకు బహుమతులు అందించారు.

Published : 05 Jan 2023 01:19 IST

చెన్నై: నయనతార (Nayanthara)- విఘ్నేశ్‌ శివన్‌ (Vignesh Shivan) దంపతులకు గతేడాది ఎన్నో మధురానుభూతులు అందించింది. పెళ్లి, తల్లిదండ్రులు కావడం.. ఇలా ఎన్నో సంతోషాల నడుమ కొత్త ఏడాదిలోకి ఈ జోడీ అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో తమ ఆనందాన్ని ఇతరులతో పంచుకోవాలనే ఉద్దేశంలో నయన్‌ దంపతులు తమ మంచి మనసు చాటుకున్నారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని చెన్నైలోని ఓ ప్రముఖ రైల్వేస్టేషన్‌ వద్ద నివసిస్తోన్న నిరుపేదలకు బహుమతులు అందించారు. ఈ మేరకు బుధవారం ఉదయం వారిని కలిసి స్వయంగా బహుమతులు ఇచ్చారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. వాటిని చూసిన పలువురు నెటిజన్లు నయన్‌ ఉదారతను మెచ్చుకుంటున్నారు.

‘అగ్రకథానాయిక అయినప్పటికీ.. ఆమే స్వయంగా ఇలా నిరుపేదలను కలిసి గిఫ్ట్‌లు అందించడం గొప్ప విషయం’ అని అనుకుంటున్నారు. సినిమాల విషయానికి వస్తే.. నయన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘కనెక్ట్‌’ ఇటీవల విడుదలై మిశ్రమ స్పందనలు అందుకుంది. హారర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయన్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి. షారుక్‌ ఖాన్‌ ‘జవాన్‌’లోనూ నయన్‌ నటించనున్నారు. అట్లీ దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని