Nayan Vignesh: నయన్‌-విఘ్నేశ్‌ లవ్‌ డాక్యుమెంటరీ.. నెట్‌ఫ్లిక్స్‌ స్పష్టత

అగ్రకథానాయిక నయనతార (Nayanthara), దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ (Vignesh Shivan) ప్రేమ, పెళ్లి డాక్యూమెంటరీపై గత కొంతకాలంగా జరుగుతోన్న ప్రచారానికి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌...

Published : 21 Jul 2022 15:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అగ్రకథానాయిక నయనతార (Nayanthara), దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ (Vignesh Shivan) ప్రేమ, పెళ్లి డాక్యుమెంటరీపై గత కొంతకాలంగా జరుగుతోన్న ప్రచారానికి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) చెక్‌ పెట్టింది. తమ ఫ్లాట్‌ఫామ్ వేదికగా త్వరలో ఈ డాక్యుమెంటరీ ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నయన్‌-విఘ్నేశ్‌ ఫొటోలను తాజాగా ట్విటర్‌లో షేర్‌ చేసిందా సంస్థ. ప్రస్తుతం ఈ ఫొటోలు అందరి దృష్టిని తమ వైపుకు తిప్పుకుంటున్నాయి.

సుమారు ఏడేళ్లపాటు ప్రేమలో ఉన్న నయనతార-విఘ్నేశ్‌ శివన్‌ పెద్దల అంగీకారంతో గత నెలలో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో జూన్‌ 9న ఈ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన అగ్రతారాలోకం సమక్షంలో జరిగిన ఈ వేడుక ఫుటేజీ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. ఈ మేరకు త్వరలోనే ఆ వాళ్లిద్దరి లవ్‌ స్టోరీ, పెళ్లి వీడియోని ఆ సంస్థ.. తమ ఫ్లాట్‌ఫామ్‌ వేదికగా ప్రసారం చేయనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ‘‘నయనతార-విఘ్నేశ్‌ శివన్‌ల ఫొటోలు చూస్తుంటే మనకు మెరిసే నక్షత్రాలు కనిపిస్తున్నాయి. వాళ్లు త్వరలో నెట్‌ఫ్లిక్స్‌కి రానున్న కారణంగా మేము ఆనందంతో డ్యాన్స్‌ చేస్తున్నాం. ఇదొక అద్భుతకావ్యం’’ అని రాసుకొచ్చింది. నయన్‌-విఘ్నేశ్‌ల డాక్యూమెంటరీ కోసం ఈ జంటకు నెట్‌ఫ్లిక్స్‌ రూ.200 కోట్లు ఇచ్చిందని, అనుకోని కారణాల వల్ల ఈ డీల్‌ క్యాన్సిలైందని ఇటీవల ప్రచారం సాగింది. తాజాగా విడుదలైన ప్రకటనతో ఆ ప్రచారానికి చెక్‌ పడినట్లు అయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని