NBK 107: బాలయ్య 107.. వేట మొదలైంది..!

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. మాస్‌ హంగులతో కూడిన పవర్‌ఫుల్‌ యాక్షన్‌...

Updated : 28 May 2022 18:40 IST

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. మాస్‌ హంగులతో కూడిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి తాజాగా పవర్‌ఫుల్‌ పోస్టర్‌ విడుదలైంది. నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ శనివారం ఉదయం ‘వేట మొదలైంది’ అంటూ సరికొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. తననే నమ్ముకున్న వారి సంరక్షణ కోసం కత్తి చేతపట్టి సమరానికి సిద్ధమైనవాడిగా బాలయ్య లుక్‌ అదరగొట్టేలా ఉంది.

‘‘విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక శ్రీ నందమూరి తారక రామారావు గారి శతజయంతి సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకుంటూ.. #NBK107 మాస్‌ పోస్టర్‌ మీకోసం’’ అని నిర్మాణ సంస్థ పేర్కొంది. యథార్థ ఘటనలు ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో బాలయ్య లుక్‌, ఆయన పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండనున్నాయి. బాలయ్యకు జోడీగా నటి శ్రుతి హాసన్‌ కనిపించనున్నారు. NBK 107 వర్కింగ్‌ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్‌ ప్రచారంలో ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని