NBK 108: విజయదశమికి బాలకృష్ణ చిత్రం

విజయదశమికి ఆయుధపూజ అంటూ  సినిమా విడుదలని ఖరారు చేసింది బాలకృష్ణ చిత్రబృందం. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో...  బాలకృష్ణ కథానాయకుడిగా ఆయన 108వ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

Updated : 01 Apr 2023 06:52 IST

విజయదశమికి ఆయుధపూజ అంటూ  సినిమా విడుదలని ఖరారు చేసింది బాలకృష్ణ (Balakrishna) చిత్రబృందం. అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో...  బాలకృష్ణ కథానాయకుడిగా ఆయన 108వ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాజల్‌ అగర్వాల్‌ (Kajal) కథానాయిక. యువ కథానాయిక శ్రీలీల (Sreeleela) ముఖ్యభూమిక పోషిస్తున్నారు. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని దసరా సందర్భంగా విడుదల చేస్తున్నట్టు తెలిపింది చిత్రబృందం. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక పోస్టర్‌ని విడుదల చేసింది. తెలంగాణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకి సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: సి.రాంప్రసాద్‌, కూర్పు: తమ్మిరాజు, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రాజీవ్‌, పోరాటాలు: వి.వెంకట్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని