Balakrishna: భారీ పోరాటంలో బాలకృష్ణ

బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్‌ కథానాయిక.

Updated : 22 Apr 2023 07:14 IST

బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్‌ కథానాయిక. శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా ఇప్పుడు బాలయ్యపై ఓ భారీ పోరాట ఘట్టాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. దీనికి వెంకట్‌ మాస్టర్‌ నేతృత్వం వహిస్తున్నారు. సినిమాకి ఎంతో కీలకమైన యాక్షన్‌ ఎపిసోడ్‌ ఇదని, దాదాపు రెండు వారాల పాటు చిత్రీకరణ కొనసాగనున్నట్లు సమాచారం. బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్లుగా సాగే ఓ శక్తిమంతమైన మాస్‌ యాక్షన్‌ కథాంశంతో అనిల్‌ ఈ చిత్రాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఇది దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి తమన్‌ స్వరాలందిస్తుండగా.. సి.రామ్‌ప్రసాద్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని