NBK 108: అన్న బరిలో దిగిండు
‘‘అన్న దిగిండు. గిప్పడి సంది లెక్కలు టక్కర్’’ అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన ప్రస్తుతం కథానాయకుడు బాలకృష్ణతో ఓ చిత్రం చేస్తున్నారు.
‘‘అన్న దిగిండు. గిప్పడి సంది లెక్కలు టక్కర్’’ అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). ఆయన ప్రస్తుతం కథానాయకుడు బాలకృష్ణతో (Balakrishna) ఓ చిత్రం చేస్తున్నారు. దీన్ని సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా.. నిర్మాత దిల్‌రాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు నవీన్ యెర్నేని, కిలారు సతీష్, శిరీష్ సంయుక్తంగా దర్శకుడికి స్క్రిప్ట్ అందించారు. గురువారమే ఓ పోరాట ఘట్టంతో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తున్నట్లు చిత్ర బృందం స్పష్టత ఇచ్చింది. ఈ యాక్షన్ సీక్వెన్స్‌కు వెంకట్ మాస్టర్ నేతృత్వం వహిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ ఓ భారీ సెట్‌ను సిద్ధం చేశారు. వినూత్నమైన మాస్ యాక్షన్ కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. బాలకృష్ణ సరికొత్త లుక్‌తో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కూర్పు: తమ్మిరాజు, ఛాయాగ్రహణం: సి.రామ్‌ప్రసాద్.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
India-China: మరిన్ని ఘర్షణలు జరగొచ్చు : తాజా నివేదికలో ప్రస్తావన
-
India News
Padma Shri: ‘పద్మశ్రీ’ వరించినా.. పక్కా ఇల్లు మాత్రం రాలేదు..!
-
Movies News
Pathaan: 32 ఏళ్ల తర్వాత అక్కడ హౌస్‌ఫుల్ బోర్డు.. ‘పఠాన్’ అరుదైన రికార్డు
-
Politics News
CM KCR: కేసీఆర్ సమక్షంలో భారాసలో చేరిన ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్
-
India News
Go First Airways: 55 మందిని వదిలేసిన గో ఫస్ట్ ఎయిర్వేస్కు భారీ జరిమానా
-
Movies News
Rakesh - Sujatha: ‘జబర్దస్త్’గా రాకింగ్ రాకేశ్- సుజాత నిశ్చితార్థం.. తారల సందడి