NBK 108: అన్న దిగిండు

ఈ సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’గా బాక్సాఫీస్‌ ముందు జోరు చూపించారు బాలకృష్ణ (Balakrishna). ఇప్పుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

Updated : 23 Mar 2023 07:13 IST

ఈ సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’గా బాక్సాఫీస్‌ ముందు జోరు చూపించారు బాలకృష్ణ (BalaKrishna). ఇప్పుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ‘ఎన్‌బికె108’ వర్కింగ్‌ టైటిల్‌తో పట్టాలెక్కిన ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఉగాది సందర్భంగా ఈ చిత్రం నుంచి రెండు ఫస్ట్‌లుక్స్‌ విడుదల చేశారు. ఆ రెండు ప్రచార చిత్రాల్లో బాలకృష్ణ సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌లో.. గడ్డం, హ్యాండిల్‌ బార్‌ మీసాలతో స్టైలిష్‌గా కనిపించారు. ‘‘అన్న దిగిండు...ఈసారి మీ ఊహలకు మించి’’ అంటూ ఆ పోస్టర్లకు జోడించిన వ్యాఖ్య సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్‌ నటిస్తుండగా.. శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రానికి తమన్‌ స్వరాలందిస్తుండగా.. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని