#NBK108: బాలయ్య - అనిల్‌ రావిపూడి కాంబో.. ఇంట్రో బీజీఎం అదిరిందిగా!

నందమూరి బాలకృష్ణ- అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా అప్‌డేట్‌ వచ్చేసింది.

Updated : 11 Aug 2022 16:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘అఖండ’తో గతేడాది ఘన విజయాన్ని అందుకున్న నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వేగం పెంచారు. ప్రస్తుతం ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో చిత్రాన్ని ఇటీవల ప్రకటించారు. అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఆ సినిమా అప్‌డేట్ కోసం బాలకృష్ణ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు మొదలవుతుంది? సంగీతం ఎవరు అందిస్తున్నారు? తదితర వాటి కోసం అన్వేషించారు. #NBK108 వర్కింగ్‌ టైటిల్‌గా ఉన్న ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఆ అప్‌డేట్‌లు వచ్చేశాయి. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై రూపొందనున్న ఈ సినిమాకి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

‘ఈ సినిమాలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని లుక్‌లో కనిపిస్తారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభమవుతుంది’ అని చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. కథానాయిక వివరాలు ఇంకా వెల్లడించలేదు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో బాలకృష్ణ కూతురిగా యువ నటి శ్రీలీల కనిపించనుంది. బాలకృష్ణ.. మలినేని గోపీచంద్‌ దర్శకత్వంలో పవర్‌ ఫుల్‌ యాక్షన్‌ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. #NBK107 వర్కింగ్‌ టైటిల్‌తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఆ సినిమా పేరును త్వరలోనే ప్రకటించనున్నారు. బాలకృష్ణ సరసన శ్రుతి హాసన్‌ నటిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని