దండేలి అడవుల్లో ‘బీబీ3’ క్లైమాక్స్ షూటింగ్‌

బాలకృష్ణ  కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘బీబీ3’ వర్కింగ్‌ టైటిల్‌గా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ కర్నాటకలోని దండేలి ఫారెస్ట్‌లో పతాక సన్నివేశాలను చిత్రీకరణ ఈరోజు ప్రారంభం కానుందని సమాచారం.

Updated : 25 Mar 2021 14:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్: బాలకృష్ణ  కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘బీబీ3’ వర్కింగ్‌ టైటిల్‌గా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ కర్ణాటకలోని దండేలి అభయారణ్యంలో పతాక సన్నివేశాలను చిత్రీకరణ జరుపుతున్నట్లు సమాచారం. బాలయ్య - ప్రగ్యాజైస్వాల్‌ ఇతర నటులపై స్టంట్‌ మాస్టర్‌ శివ పర్యవేక్షణలో యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించేందుకు దర్శకుడు బోయపాటి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారట. ఈ షెడ్యూల్‌ ఏప్రిల్ 3 నాటికి పూర్తి కానుంది.

 ద్వారకా క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ - ప్రగ్యాజైస్వాల్ ఐఏయస్‌ అధికారులుగా కనిపించనున్నారు. మరో నటి పూర్ణ  వైద్యురాలి పాత్రలో కనిపించనుందట. అయితే ఆమె పాత్రలో కొంత నెగటివ్ షేడ్స్ కూడా ఉంటాయని టాలీవుడ్‌ టాక్‌. శ్రీకాంత్‌ కీలక పాత్రలో పోషించనున్నారు. చిత్రానికి ‘గాడ్‌ ఫాదర్‌’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. తమన్‌ సంగీత స్వరాలు అందిస్తుండగా రామ్ ప్రసాద్‌ ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నారు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత. ఈ ఏడాది మే 28న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని