నా మతి చెడగొట్టావే...!

సంపూర్ణేష్‌బాబు, మహేశ్వరి వద్ది జంటగా నటిస్తున్న చిత్రం ‘బజార్‌ రౌడీ’. వసంత నాగేశ్వరరావు దర్శకుడు. సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. సాయి కార్తిక్‌ స్వరాలందిస్తున్నారు. ఈ చిత్రంలోని రెండో గీతాన్ని సోమవారం విడుదల చేశారు.

Updated : 29 Jun 2023 15:58 IST

సంపూర్ణేష్‌బాబు, మహేశ్వరి వద్ది జంటగా నటిస్తున్న చిత్రం ‘బజార్‌ రౌడీ’. వసంత నాగేశ్వరరావు దర్శకుడు. సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. సాయి కార్తిక్‌ స్వరాలందిస్తున్నారు. ఈ చిత్రంలోని రెండో గీతాన్ని సోమవారం విడుదల చేశారు. ‘‘పిల్లా నా మతి చెడగొట్టావే’’ అంటూ హుషారుగా సాగుతున్న ఈ డ్యూయెట్‌కి గణేష్‌ సాహిత్యమందించగా.. దత్తు, పల్లవి ఆలపించారు. ‘‘ఈ సినిమాలో సంపూర్ణేష్‌ పక్కా మాస్‌ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల్ని అలరిస్తారు. ఆయన శైలికి తగ్గట్లుగా సాగే విభిన్నమైన వినోదాత్మక కథతో ఈ చిత్రం తెరకెక్కించాం. కరోనా తీవ్రత తగ్గిన వెంటనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’ని చిత్ర బృందం తెలియజేసింది. ఈ చిత్రానికి కూర్పు: గౌతం రాజు, ఛాయాగ్రహణం: ఏ విజయ్‌ కుమార్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని