Acharya: ‘ఆచార్య’.. నీలాంబరి ఫుల్‌ వీడియో చూశారా!

చిరంజీవి, రామ్‌ చరణ్‌ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమాలోని హిట్‌ గీతాల్లో ‘నీలాంబరి’ ఒకటి. సినిమా విడుదలకు ముందే ఈ పాట లిరికల్‌ వీడియో శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది.

Updated : 07 Dec 2022 19:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిరంజీవి, రామ్‌ చరణ్‌ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’ (Acharya). ఈ సినిమాలోని హిట్‌ గీతాల్లో ‘నీలాంబరి’ (Neelambari) ఒకటి. సినిమా విడుదలకు ముందే ఈ పాట లిరికల్‌ వీడియో శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఫుల్‌ వీడియో అలరిస్తోంది. రామ్‌చరణ్‌, పూజాహెగ్డేపై తెరకెక్కిన ఈ వినసొంపైన గీతాన్ని చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా గురువారం విడుదల చేసింది. చరణ్‌- పూజా లుక్స్‌, హావభావాలతో అందరినీ తమవైపు తిప్పుకునేలా ఉన్నారు. అనంత శ్రీరామ్‌ రచించిన ఈ పాటను అనురాగ్‌ కులకర్ణి, రమ్య బెహర ఆలపించారు. మణిశర్మ స్వరాలందించారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి (Chiranjeevi) ఆచార్యగా, చరణ్‌ (Ram Charan) సిద్ధగా నటించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని