అల‌రిస్తోన్న‘నీలి నీలి ఆకాశం’ న‌యా వెర్ష‌న్

 సంగీత ప్రియుల్ని ఓల‌లాడించిన పాటల్లో ‘నీలి నీలి ఆకాశం’ ఒక‌టి. ‘30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?’ చిత్రంలోనిది ఈ గీతం.

Updated : 07 Dec 2022 15:02 IST

ఇంట‌ర్నెట్ డెస్క్‌: సంగీత ప్రియుల్ని ఓల‌లాడించిన పాటల్లో ‘నీలి నీలి ఆకాశం’ ఒక‌టి. ‘30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?’ చిత్రంలోనిది ఈ గీతం. విడుద‌లైన అన‌తి కాలంలోనే కొన్ని కోట్ల హృద‌యాల్ని మీటి యూ ట్యూబ్‌లో రికార్డు సృష్టించింది. చిన్న పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు అన్ని వ‌ర్గాల శ్రోత‌ల్ని విప‌రీతంగా ఆకట్టుకుంది. సిధ్ శ్రీరామ్, సునీత గానం, చంద్ర‌బోస్ సాహిత్యం, అనూప్ రూబెన్స్ సంగీతం అద్భుతంగా నిలిచిన ఆ సుమ‌ధుర గీతాన్ని  క‌వ‌ర్ సాంగ్ పేరిట మ‌రోసారి ఆవిష్క‌రించారు. అయితే ఈ సారి మేల్ వెర్ష‌న్‌ని ర‌చ‌యిత చంద్ర‌బోస్ ఆల‌పించగా సునీత త‌న వెర్ష‌న్‌ని పాడారు. అనూప్ సంగీత‌ సార‌థ్యంలో ఈ  నీలి నీలి ఆకాశం క‌వ‌ర్ సాంగ్ రూపొందింది. తాజాగా విడుద‌లై విశేషంగా అల‌రిస్తోంది. ప్ర‌దీప్ మాచిరాజు, అమృత అయ్య‌ర్ జంట‌గా తెర‌కెక్కింది ‘30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?’. మున్నా ద‌ర్శ‌క‌త్వం వహించారు. ప్ర‌స్తుతం ప్ర‌ముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని