NET: అవికాగోర్‌ ఇంట్లో సీక్రెట్‌ కెమెరా.. రాహుల్‌ రామకృష్ణ ఏం చేశాడు?

NET: రాహుల్‌ రామకృష్ణ, అవికాగోర్‌ నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘నెట్‌’ ట్రైలర్‌ చూశారా?

Updated : 26 Aug 2021 17:30 IST

హైదరాబాద్‌: ఒక వ్యక్తి జీవితంపై మొబైల్‌, ఇంటర్నెట్‌ ఎలాంటి ప్రభావాన్ని చూపాయి? దానికి బానిసైన ఆ వ్యక్తి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? కుటుంబ కలహాలకు కారణం ఏంటి? చివరకు ఆ ఇబ్బందుల నుంచి అతను బయటపడ్డాడా? తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు రాహుల్‌ రామకృష్ణ. అవికాగోర్‌తో కలిసి ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం ‘నెట్‌’. భార్గవ్‌ మాచర్ల దర్శకుడు. సస్పెన్స్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. లక్ష్మణ్‌ అనే వ్యక్తి పాత్రలో రాహుల్‌ రామకృష్ణ కనిపించనున్నారు. అవికాగోర్‌.. ప్రియ అనే అమ్మాయి పాత్ర షోషించారు. అశ్లీల చిత్రాలు వీక్షించే రాహుల్‌ చివరికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సీక్రెట్‌ కెమెరాల ద్వారా ప్రియ ప్రైవేట్‌ లైఫ్‌ని వీక్షించిన రాహుల్‌ చిక్కుల్లో పడటానికి కారణమేమిటి? ప్రియ జీవితాన్ని సీక్రెట్‌ కెమెరాలతో చిత్రీకరించింది ఎవరు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం కావాలంటే సెప్టెంబర్‌ 10న జీ5 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ వేదికగా విడుదల కానున్న ‘నెట్‌’ చూడాల్సిందే. అప్పటి వరకూ ఈ ఆసక్తికర ట్రైలర్‌ చూసేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని