Rajamouli: రాజమౌళిపై నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే!

రాజమౌళిపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీ రూపొందించింది. దాని వివరాలను పంచుకుంది.

Updated : 06 Jul 2024 16:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లతో ప్రపంచాన్ని ఆకర్షించిన రాజమౌళిపై నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీ రూపొందించింది. దీని స్ట్రీమింగ్‌ తేదీని, ఇందులో ఏం చూపనున్నారో తెలుపుతూ తాజాగా ఆ సంస్థ (Netflix) పోస్ట్‌ పెట్టింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది. ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ పేరుతో ఇది రానున్నట్లు తెలిపింది.

‘ఒక మనిషి.. అనేక బ్లాక్‌బస్టర్‌లు.. అంతులేని ఆశయం. ఈ లెజెండరీ దర్శకుడు ఇంత గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డారు? ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇలాంటి అంశాలతో ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ రూపొందింది. ఆగస్టు2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రసారం కానుంది’ అని సంస్థ పేర్కొంది. దీన్ని అనుపమా చోప్రా సమర్పించనున్నారు. ఈ డాక్యుమెంటరీలో పలువురు హాలీవుడ్‌ దర్శకులు, సినీ ప్రముఖులు రాజమౌళిపై (SS Rajamouli) వారి అభిప్రాయాలను తెలియజేయనున్నారు. టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు కూడా ఈ దర్శకధీరుడితో వారి అనుబంధాన్ని పంచుకోనున్నట్లు తెలుస్తోంది. 

అనంత్‌ - రాధికా సంగీత్‌.. మెరిసిన బాలీవుడ్‌ తారలు

రాజమౌళి ప్రస్తుతం మహేశ్‌బాబుతో తీయనున్న ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. దీని ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ హీరోయిన్‌గా, హాలీవుడ్‌ ప్రముఖ నటుడు క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ కీలకపాత్ర పోషించనున్నారని కూడా జోరుగా ప్రచారమవుతోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని