Pawan kalyan: చంద్రబాబు, పవన్‌ల ప్రమాణస్వీకారం.. ప్రముఖుల శుభాకాంక్షలు

నేడు ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబునాయుడు, పవన్‌ కల్యాణ్‌లకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated : 12 Jun 2024 17:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడుకు (Chandrababu) శుభాకాంక్షలు తెలుపుతూ అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) ఎక్స్ వేదికగా పోస్ట్‌ పెట్టారు. మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా కూడా విష్ చేశారు.

  • ‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు (Pawan Kalyan) అలాగే మిగిలిన మంత్రి వర్గానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు పాటుపడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.. ఆశిస్తున్నాను’ - చిరంజీవి
  • ‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబునాయుడు గారికి శుభాకాంక్షలు’ - ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra)
  • ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జనసేనాని, పవర్‌ స్టార్‌ పవన్‌కల్యాణ్ గారికి అభినందనలు. మీ పట్టుదల, అంకితభావమే ఈ విజయానికి దారితీశాయి. గూస్‌బంప్స్‌ మూమెంట్‌ అన్న’ - మంచు మనోజ్‌
  • ‘‘పెదనాన్నా.. గత నాలుగున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఎన్నో ఒడిదొడుకులు చూశారు. తట్టుకున్నారు. ఆత్మవిశ్వాసంతో నిలబడ్డారు. కానీ, గత ఐదేళ్ల కాలంలో ఎంతో మధనపడ్డారు, పార్టీని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. మీకు కష్టం వచ్చినప్పుడు వారంతా మీకు సపోర్ట్‌గా నిలిచారు. నలభై ఏళ్ల మీ కష్టానికి మీరు పొందింది ప్రజల హృదయాల్లో కదిలించలేని స్థానం అని అప్పుడర్థమైంది. ఎవరూ మళ్లీ తిరగరాద్దాం అనే సాహసం చెయ్యలేని విజయాన్ని ఈ ఎన్నికల్లో అందుకున్నారు. ఆ విజయం ఎన్డీయే కూటమిది మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలది, తెలుగు వారిది. మనందరిది’’ - నారా రోహిత్‌

  •  

    ‘‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు గారికి కంగ్రాట్స్‌. ‘కొణిదెల పవన్‌ కల్యాణ్‌ అనే నేను’.. అంటూ బాబాయ్‌ ప్రమాణస్వీకారం చేస్తుంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆనందకర క్షణాలవి’’    - వరుణ్‌తేజ్‌ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు