Naga Vamsi: స్టార్‌ హీరో సినిమా.. నిర్మాత నాగవంశీ కీలక నిర్ణయం

ధనుష్‌ - సంయుక్త జంటగా నటించిన రీసెంట్‌ మూవీ ‘వాతి’ (Vaathi). ఇదే చిత్రాన్ని తెలుగులో ‘సార్‌’ (SIR) పేరుతో విడుదల చేశారు.

Updated : 04 Mar 2023 18:39 IST

హైదరాబాద్‌: చదువు గొప్పతనాన్ని తెలియజేసేలా తెరకెక్కిన చిత్రం ‘సార్‌’ (SIR). కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ (Dhanush) కథానాయకుడిగా వెంకీ అట్లూరి (Venky Atluri) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఇది రూపుదిద్దుకుంది. ప్రస్తుతం థియేటర్లలో రన్‌ అవుతోన్న ఈ సినిమా విషయంలో నిర్మాత నాగవంశీ (Naga Vamsi) ఓ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. పాఠశాలల్లో చదువుతోన్న చిన్నారుల కోసం దీన్ని ఉచితంగా ప్రదర్శించాలనుకున్నారు.

‘‘విద్య వల్ల వచ్చే గౌరవాన్ని, దాని విలువపై అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ‘సార్‌’ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ నేపథ్యంలోనే స్కూల్స్‌లో చదువుతోన్న పిల్లలకు మా ఈ చిత్రాన్ని ఉచితంగా చూపించనున్నందుకు ఆనందిస్తున్నాను. మీ స్కూల్‌కు సంబంధించిన వివరాలను మా సంస్థకు మెయిల్‌ చేయగలరు. షో వివరాలను మా టీమ్‌ మీకు త్వరలో తెలియజేస్తుంది’’ అని వంశీ పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ చూసిన నెటిజన్లు నిర్మాత నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తాజాగా ఈ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ వీక్షించారు. సినిమా బాగుందంటూ చిత్రబృందాన్ని మెచ్చుకున్నారు.  ‘సార్‌’ బాక్సాఫీస్‌ వద్ద బాగానే సందడి చేస్తోంది. తాజాగా తెలుగు, తమిళ భాషల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.100కోట్ల (గ్రాస్‌) మార్కును దాటింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం పోస్టర్‌ను విడుదల చేసింది. అంతేకాదు, సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని