Pawankalyan: మాకు అనిరుధ్ కావాలి.. డీవీవీకి నెటిజన్లు వరుస ట్వీట్స్‌

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ - సుజిత్‌ కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ని తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. 

Published : 07 Dec 2022 15:28 IST

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) మేనరిజానికి, అనిరుధ్‌ (Anirudh) మ్యూజిక్‌ తోడైతే తమకు పండగేనని అంటున్నారు పవర్‌స్టార్‌ అభిమానులు. ‘సాహో’ సుజిత్‌ (Sujeeth) కాంబినేషన్‌లో పవన్‌ నటించనున్న చిత్రానికి సంగీత దర్శకుడిగా అనిరుధ్‌నే తీసుకోవాలని కోరుతూ చిత్రనిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు వరుస ట్వీట్స్‌ చేస్తున్నారు. పవన్‌-అనిరుధ్‌ కాంబోలో వచ్చిన ‘అజ్ఞాతవాసి’లోని యాక్షన్‌ స్వీన్స్‌, ‘విక్రమ్‌’ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కు ‘పంజా’లోని పవన్‌కల్యాణ్‌ వీడియోను యాడ్‌ చేసి సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. #DVVWeWantAnirudhForOG అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేస్తూ ఇప్పటివరకూ దాదాపు 52 వేల ట్వీట్స్‌ వచ్చాయి. మరోవైపు, ఈ సినిమా సంగీత దర్శకుడు, ఇతర వివరాలను త్వరలోనే చెబుతామని ఇటీవల డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వెల్లడించింది. పవర్‌ఫుల్‌ కథాంశంతో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా సిద్ధం కానుంది. ఇందులో పవన్‌కల్యాణ్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. జపాన్‌, ముంబయి నేపథ్యంలో కథ సాగే అవకాశం ఉందని టాక్‌.







Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు