
Pushpa-Amul: ‘పుష్ప’ అమూల్ కార్టూన్ చూశారా?
ఇంటర్నెట్ డెస్క్: పాన్ ఇండియా మూవీగా ‘పుష్ప’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రానికి మరో గౌరవం లభించింది. పాల్ప ఉత్పత్తులను విక్రయించే సంస్థ అమూల్ సంస్థ ‘పుష్ప’ అమూల్ కార్టూన్ని తాజాగా పోస్ట్ చేసింది. సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచిన పోస్టర్లను ఎంపిక చేసింది. ఎర్రచందనం దుంగలపై ‘పుష్ప’ కూర్చునే కార్టూన్లో.. చేతిలో బ్రెడ్‌పై బటర్, అలాగే శ్రీవల్లి సామీ స్టెప్ పోస్టర్లో ఓ చేతికి బటర్ రాసిన బ్రెడ్.. మరో చేతిలో బటర్ రాసిన కత్తితో కార్టూన్ విడుదల చేసింది, ‘పుష్ప్యాక్ ది స్లైస్.. హేవ్ సమ్ అమూల్, అర్జున్’ అనే క్యాప్షన్‌ను జతచేసింది. ఈ కార్టూన్‌పై అమెజాన్ ప్రైమ్ వీడియో స్పందించింది. ఇందులో కనిపించే బటర్ ఫ్లవర్ కాదని ఫైర్ అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం నెట్టింట ‘పుష్ప’ హవా నడుస్తోంది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కరోనా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అల్లు అర్జున్ మీమ్‌ను ట్వీట్ చేసింది. ‘డెల్టా అయినా ఒమిక్రాన్ అయినా మాస్క్ తీసేదే లే’ అని హిందీలో చెబుతూ పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.