రాజకీయాల్లోకి రమ్మని చెబుతారా?

టాలీవుడ్‌లో అగ్ర హీరోలు..దర్శకుల కాంబినేషన్‌ అంటేనే ఓ క్రేజ్‌ ఉంటుంది. ఇక కొత్త కాంబినేషన్‌ అయితే అంచనాలు మాములుగా ఉండవు. ఇప్పుడు అలాంటి కాంబినేషన్‌ ఒకటి రాబోతున్నట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప’ చిత్రంతో అల్లు

Updated : 30 Jul 2020 13:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కథ పక్కా అయింది. కలయిక కుదిరింది. ఇక ప్రకటనే ఆలస్యం. అల్లు అర్జున్‌ కథా నాయకుడిగా, కొరటాల శివ దర్శకత్వంలో సినిమాకి రంగం సిద్ధమైంది. ఈ నెల 31న చిత్రాన్ని ప్రకటించబోతున్నారు. అల్లు అర్జున్‌ చిన్ననాటి స్నేహితులు ముగ్గురు ఈ సినిమా నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నట్టు సమాచారం. అల్లు అర్జున్‌ తన స్నేహితుల్ని, బంధువుల్ని తన సినిమాల్లో భాగం చేస్తుంటారు. ‘రేసుగుర్రం’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘పుష్ప’ సినిమా నిర్మాణంలోనూ ఆయన బంధువులు భాగం పంచుకున్నారు. మరోసారి అదే తరహాలో అవకాశం  ఇస్తున్నారు. అల్లు అర్జున్‌ కోసం కొరటాల శివ ఇటీవలే కథని సిద్ధం చేసి వినిపించినట్టు సమాచారం. అది పక్కా కావడంతో సినిమాని ప్రకటించాలని నిర్ణయించారు.

లాక్‌డౌన్‌ సమయంలో కొరటాల శివ అల్లు అర్జున్‌ కోసం కథ సిద్ధం చేశారట. ఇందులో అల్లు అర్జున్‌ విద్యార్థి నాయకుడిగా కనిపిస్తారని తొలుత వార్తలొచ్చాయి. ఈ విషయంలో మరో అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమాలో బన్నీ విద్యార్థి నాయకుడిగానే కాకుండా యువతను రాజకీయాల్లోకి రమ్మని చెప్పే యువకుడిగా కనిపిస్తాడట. మెరుగైన సమాజం కోసం యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరాన్ని తెలియజేసేలా కథ ఉండబోతోందట.ఈ సినిమా కోసం యువ రాజకీయాలపై కొరటాల అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే విద్యార్థి రాజకీయాల మీద కొన్ని సినిమాలు వచ్చాయి. అన్నీ ప్రేక్షకుల ఆదరణను చూరగొన్నాయి. ఈ నేపథ్యంలో అల్లు - కొరటాల పిలుపు ఎలా ఉంటుందో చూడాలి. కొరటాల ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడిగా ‘ఆచార్య’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్‌ త్వరలోనే ‘పుష్ప’ కోసం రంగంలోకి దిగబోతున్నారు. ఈ రెండింటి తర్వాతే అల్లు అర్జున్‌ - కొరటాల కలయికలో సినిమా పట్టాలెక్కబోతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని