
Published : 16 Jan 2022 15:19 IST
Suma: జయమ్మ.. చూసే జనం కళ్లకి సూర్యకాంతమ్మ!
‘జయమ్మ..’ లిరికల్ వీడియో సాంగ్‌ని విడుదల చేసిన ఎస్.ఎస్. రాజమౌళి
హైదరాబాద్: బుల్లితెర వ్యాఖ్యాత సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయతీ’. విజయ్ కలివారపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతమందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ‘జయమ్మ..’ లిరికల్ సాంగ్ వీడియోని ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. ‘కాసింత భోళాతనం.. కాసింత జాలిగుణం..’ అంటూ సాగే ఈ పాటలో జయమ్మ పాత్ర జీవనశైలి ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేశారు. ఈ పాటకి రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించగా.. శ్రీకృష్ణ ఆలపించారు. బలగ ప్రకాశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవీ చదవండి
Tags :