Satyadev: చిరుని ఢీ కొట్టేందుకు.. సత్యదేవ్‌ సిద్ధమయ్యారిలా..!

మలయాళంలో సూపర్‌హిట్ అందుకున్న పొలిటికల్‌ థ్రిల్లర్‌ ‘లూసిఫర్‌’కు రీమేక్‌గా సిద్ధమైన చిత్రం ‘గాడ్‌ఫాదర్‌’. మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published : 02 Oct 2022 14:16 IST

హైదరాబాద్‌: చిరంజీవి (Chiranjeevi) పవర్‌ఫుల్‌ రోల్‌లో నటించిన కొత్త చిత్రం ‘గాడ్‌ఫాదర్‌’ (Godfather). మలయాళీ చిత్రం ‘లూసిఫర్‌’కు రీమేక్‌ ఇది. మోహన్‌రాజా దర్శకుడు, సత్యదేవ్‌, నయనతార కీలకపాత్రల్లో కనిపించనున్నారు. మరో మూడు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం మేకింగ్‌ వీడియోను షేర్‌ చేసింది. బ్రహ్మ (చిరంజీవి)ను ఢీ కొట్టేందుకు.. జైదేవ్‌ (సత్యదేవ్‌) ఎలా సిద్ధమయ్యారో ఈ వీడియోలో చూపించారు. ఈ సినిమాలో నయనతార భర్తగా సత్యదేవ్‌ కనిపించనున్నారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా సిద్ధమైన ఈ సినిమా ప్రచార చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఈ సినిమాలో ముఖ్య భూమిక పోషించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని