Tollywood: కొత్త చిత్రానికి శ్రీకారం

శ్రీకల్యాణ్‌, శశి జంటగా గేదెల రవిచంద్ర తెరకెక్కిస్తున్న చిత్రం ‘మెగా పవర్‌’. అడబాల నాగబాబు, సాయి నిర్మల, ఇల్లా అభిషేక్‌, సత్యమూర్తి గేదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Updated : 23 Mar 2023 07:19 IST

అల్లరి నరేష్‌, ఫరియా అబ్దుల్లా జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. మల్లి అంకం దర్శకుడు. రాజీవ్‌ చిలక నిర్మాత. ఈ సినిమా బుధవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి డి.సురేష్‌బాబు క్లాప్‌ కొట్టగా.. తరుణ్‌ భాస్కర్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. నాగ్‌ అశ్విన్‌ గౌరవ దర్శకత్వం వహించారు. జెమిని కిరణ్‌, శరత్‌ మరార్‌ స్క్రిప్ట్‌ అందించారు. ఈ సందర్భంగా హీరో అల్లరి నరేష్‌ మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌. ప్రేక్షకులు నా నుంచి కోరుకునే ఫన్‌, ఫ్యామిలీ ఎమోషన్స్‌ అన్నీ ఇందులో ఉంటాయి. ఏప్రిల్‌ 10 నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలవుతుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఫరియా, మల్లి, అబ్బూరి రవి, రాజీవ్‌ తదితరులు పాల్గొన్నారు.


‘మెగా పవర్‌’.. మొదలైంది


శ్రీకల్యాణ్‌, శశి జంటగా గేదెల రవిచంద్ర తెరకెక్కిస్తున్న చిత్రం ‘మెగా పవర్‌’. అడబాల నాగబాబు, సాయి నిర్మల, ఇల్లా అభిషేక్‌, సత్యమూర్తి గేదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పృథ్వీ, మురళీ శర్మ, రఘుబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి రఘుబాబు క్లాప్‌ కొట్టగా.. కిరణ్‌ అబ్బవరం కెమెరా స్విచ్చాన్‌ చేశారు. పృథ్వీ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు రవిచంద్ర మాట్లాడుతూ.. ‘‘అమ్మ సెంటిమెంట్‌తో సాగే యాక్షన్‌ చిత్రమిది. త్వరలో ఈ సినిమాలోని ఒక్కో పాత్రను పరిచయం చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి మ్యాడీ సంగీతమందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని