శివరాత్రి రోజున పోస్టర్ల సందడి..!

కొంతమంది దీనిని పిచ్చి అంటారు. మేము మాత్రం ప్రేమ అంటాం. ఈ ప్రేమకథ ఎప్పటికీ మీ హృదయాల్లో గుర్తుండిపోతుంది!!’’ అని అంటున్నారు నటి పూజాహెగ్డే. ఆమె కథానాయికగా ప్రభాస్‌కు జోడీగా నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్‌’....

Published : 11 Mar 2021 14:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘కొంతమంది దీనిని పిచ్చి అంటారు. మేము మాత్రం ప్రేమ అంటాం. ఈ ప్రేమకథ ఎప్పటికీ మీ హృదయాల్లో గుర్తుండిపోతుంది!!’’ అని అంటున్నారు నటి పూజాహెగ్డే. ఆమె కథానాయికగా ప్రభాస్‌కు జోడీగా నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తాజాగా ఓ సరికొత్త పోస్టర్‌ను చిత్రబృందం షేర్‌ చేసింది. అయితే, కేవలం ‘రాధేశ్యామ్‌’ మాత్రమే కాకుండా ‘నారప్ప’, ‘ఖిలాడీ’తోపాటు పలు సినిమా పోస్టర్లతో నెట్టింట్లో సందడి నెలకొంది. మరోవైపు ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ‘అన్నం’: పరబ్రహ్మ స్వరూపం అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక, గురువారం విడుదలైన సరికొత్త సినిమా పోస్టర్లపై మీరూ ఓ లుక్కేయండి..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని