Bollywood: రీమేక్‌ టీజర్‌ల సందడి

దక్షిణాది చిత్రాలకు హిందీలో మంచి డిమాండ్‌ ఉంది. ఓ పక్క ఇక్కడి చిత్రాలు అక్కడికి అనువాదంలో రూపంలో వెళుతూనే...కొన్ని చిత్రాలు రీమేక్‌ అవుతున్నాయి.

Updated : 23 Nov 2022 07:19 IST

దక్షిణాది చిత్రాలకు హిందీలో మంచి డిమాండ్‌ ఉంది. ఓ పక్క ఇక్కడి చిత్రాలు అక్కడికి అనువాదంలో రూపంలో వెళుతూనే...కొన్ని చిత్రాలు రీమేక్‌ అవుతున్నాయి. అలా రీమేక్‌ అయిన చిత్రాల్లో ‘భోలా’, ‘శహ్‌జాదా’లు మంచి క్రేజ్‌ ఉన్న చిత్రాలు. తాజాగా ఈ రెండు చిత్రాలకు సంబంధించిన టీజర్‌లు విడుదలై ఆకట్టుకుంటున్నాయి.


‘భోలా’వచ్చాడు

యాక్షన్‌ కథానాయకుల్లో అజయ్‌దేవ్‌గణ్‌ (Ajay Devgn) పేరు ఎప్పుడూ ముందు వరసలోనే ఉంటుంది. తాజాగా ఆయన నుంచి రాబోతున్న మరో యాక్షన్‌ చిత్రం ‘భోలా’ (Bholaa). కార్తి నటించిన ‘ఖైదీ’ చిత్రానికి హిందీ రీమేక్‌ ఇది. ‘ఖైదీ’ తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలై భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్‌ అలరిస్తోంది. టబు, అమలాపాల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అజయ్‌దేవ్‌గణే దర్శకత్వం వహిస్తున్నారు. ‘‘ఇందులోని యాక్షన్‌ ఘట్టాలు కొత్తగా సాగుతాయి. వాటిని త్రీడీలో చూస్తే మరింత ఎంజాయ్‌గా ఉంటుంది’’అని చిత్రవర్గాలు చెబుతున్నాయి. మార్చి 30, 2023న ఈ సినిమా విడుదల కానుంది.


హిందీ ‘అలవైకుంఠపురములో’ కార్తీక్‌ హంగామా

ల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో..’ భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం హిందీలో ‘శహ్‌జాదా’ (Shehzada)గా రీమేక్‌ అవుతోంది. ఇందులో యువ కథానాయకుడు కార్తీక్‌ ఆర్యన్‌ (Kartik Aaryan) నటిస్తున్నాడు. మంగళవారం కార్తీక్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఇది నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. మాస్‌ ప్రేక్షకుల్ని అలరించేలా సాగే ఈ టీజర్‌లో కార్తీక్‌తో పాటు చిత్ర కథానాయిక కృతిసనన్‌ కూడా సందడి చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు