Updated : 02 Jun 2021 16:46 IST

OTT: జూన్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చే చిత్రాలివే!

కరోనా సెకండ్‌వేవ్‌ దెబ్బకు థియేటర్‌లన్నీ మళ్లీ మూతపడిన సంగతి తెలిసిందే. మరోవైపు షూటింగ్‌లు సైతం ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. కేసులు తగ్గి, పరిస్థితులు పూర్తిగా అదుపులోకి రావడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అయితే, ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న అనేక సినిమాలు.. వెబ్‌ సిరీస్‌లు ఓటీటీల వేదికగా సందడి చేస్తున్నాయి. జూన్‌ నెలలో అలా అలరించేందుకు సిద్ధమైనవి ఇవే!

ఫ్యామిలీమ్యాన్‌2

ప్రస్తుతం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న వెబ్‌సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మ్యాన్‌: సీజన్‌2’ కోసమే. రాజ్‌, డీకే ద్వయం సృష్టించిన ‘ది ఫ్యామిలీమ్యాన్‌’ ఎంతలా అలరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దానికి కొనసాగింపుగా జూన్‌ 4 నుంచి ‘ఫ్యామిలీమ్యాన్‌2’ ప్రసారం కానుంది. శ్రీకాంత్‌ తివారిగా మనోజ్‌బాజ్‌పాయ్‌ కొనసాగుతుండగా, సరికొత్త పాత్రలో సమంత దర్శనమివ్వబోతున్నారు. మరి తొలి సీజన్‌ను మించి రెండో సీజన్‌ అలరిస్తుందా? తెలియాలంటే కొంచెం వేచి చూడాలి.

పేరు: ఫ్యామిలీమ్యాన్‌2

విడుదల తేదీ: జూన్‌ 4, 2021

ఎక్కడ చూడొచ్చు: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో


టోవిన్‌ థామస్‌ ‘కాలా’

ఇటీవల కాలంలో సరికొత్త కాన్సెప్ట్‌లతో మలయాళ చిత్రాలు ఆ భాష ప్రేక్షకులనే కాకుండా, ఇతర భాషా సినీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మలయాళ నటుడు టోవినో థామస్‌ నటించిన ‘కాలా’ చిత్రం తెలుగువారి ముందుకు రానుంది. ఆహా వేదికగా ఇది స్ట్రీమింగ్‌ కానుంది.

పేరు: కాలా

విడుదల తేదీ: జూన్‌ 4, 2021

ఎక్కడ చూడొచ్చు: ఆహా


‘అర్ధశతాబ్దం’తో వస్తున్నారు

కార్తీక్ రత్నం‌, నవీన్ చంద్ర, కృష్ణ ప్రియ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘అర్ధ శతాబ్దం’. రవీంద్ర పుల్లె దర్శకుడు.  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆహా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

పేరు: అర్ధశతాబ్దం

విడుదల తేదీ: జూన్‌ 11, 2021

ఎక్కడ చూడొచ్చు: ఆహా


సన్‌ ఫ్లవర్‌

బాలీవుడ్‌ నటుడు సునీల్‌ గ్రోవర్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘సన్‌ఫ్లవర్‌’. మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం జీ5 వేదికగా అలరించేందుకు సిద్ధమైంది.

పేరు: సన్‌ఫ్లవర్‌

విడుదల తేదీ: జూన్‌ 11, 2021

ఎక్కడ చూడొచ్చు: జీ5


జగమేతంత్రం అంటున్న ధనుష్‌

విభిన్న కథలు, పాత్రలతో దూసుకుపోతున్న తమిళ నటుడు ధనుష్‌. ఆయన నటించిన పలు చిత్రాలు ఇతర భాషల్లోను విడుదలవుతున్నాయి. కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో ధనుష్‌ నటించిన తాజా చిత్రం ‘జగమేతంత్రం’. గతేడాది థియేటర్‌లలో విడుదల కావాల్సిన ఈ సినిమా జూన్‌ 18న నెట్‌ఫ్లిక్‌లో విడుదల కానుంది.

పేరు: జగమేతంత్రం

విడుదల తేదీ: జూన్‌ 18, 2021

ఎక్కడ చూడొచ్చు: నెట్‌ఫ్లిక్స్‌

ఫారెస్ట్‌ ఆఫీసర్‌గా విద్యాబాలన్‌

విద్యాబాలన్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘షేర్నీ’. అమిత్‌ మసుర్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఆమె ఫారెస్ట్‌ అధికారిగా కనిపించనున్నారు.

పేరు: షేర్నీ

విడుదల తేదీ: జూన్‌ 18, 2021

ఎక్కడ చూడొచ్చు: అమెజాన్‌ ప్రైమ్‌


వీటితో పాటు, పలు ఇంగ్లీష్‌ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ‘లోకి’, ‘కిమ్స్‌ కన్వీనియన్స్‌’, ‘బ్లాక్‌ సమ్మర్‌ సీజన్‌2’, ‘స్కేటర్‌ గర్ల్‌’, ‘డామ్‌’, ‘లుపిన్‌ సీజన్‌2’, ‘ది డెడ్‌ డోంట్‌ డై’, ‘రాయా అండ్‌ ది లాస్ట్‌ డ్రాగెన్‌’, ‘మోర్టల్‌ కాంబ్యాట్‌’, ‘రే’ ఇలా పలు చిత్రాలు అలరించనున్నాయి.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని