Tollywood: సెట్‌లో పవన్‌ పూజలు.. నెట్టింట కొత్త పోస్టర్లు..!

పవన్‌కల్యాణ్‌, క్రిష్‌ కాంబినేషన్‌లో వస్తోన్న సరికొత్త చిత్రం ‘హరిహర వీరమల్లు’. పీరియాడికల్‌ యాక్షన్‌ చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ తాజాగా పట్టాలెక్కింది. ...

Published : 10 Apr 2022 13:51 IST

హైదరాబాద్‌: పవన్‌కల్యాణ్‌, క్రిష్‌ కాంబినేషన్‌లో వస్తోన్న సరికొత్త చిత్రం ‘హరిహర వీరమల్లు’. పీరియాడికల్‌ యాక్షన్‌ చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ తాజాగా పట్టాలెక్కింది. ఈ నేపథ్యంలో ఆదివారం శ్రీరామ నవమిని పురస్కరించుకుని ‘హరిహర వీరమల్లు’ సెట్‌లో పవన్‌ కల్యాణ్‌ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేసింది. మరోవైపు పండగ సందర్భంగా నెటిజన్లలందరికీ పలు చిత్రబృందాలు శుభాకాంక్షలు తెలిపాయి. తమ సరికొత్త చిత్రాలకు సంబంధించిన స్పెషల్‌ పోస్టర్లు విడుదల చేశాయి. ఇక, కిరణ్‌ అబ్బవరం, నరేశ్‌ తమ కొత్త ప్రాజెక్ట్‌ల టైటిల్స్‌ ప్రకటించగా.. రవితేజ నటిస్తోన్న ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ నుంచి మొదటి సాంగ్‌ కూడా విడుదలైంది. అలా, తాజాగా విడుదలైన సినిమా అప్‌డేట్‌లపై ఓ లుక్కేయండి..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని