
Mission Impossible: ఏడాది ఆలస్యంగా..
టామ్ క్రూజ్ నటించిన ‘మిషన్: ఇంపాజిబుల్’ చిత్రాలకు సినీ ప్రియుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ ప్రాంచైజీ నుంచి ‘మిషన్: ఇంపాజిబుల్ 7’, ‘మిషన్: ఇంపాజిబుల్ 8’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. టామ్ క్రూజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలను క్రిస్టోఫర్ మెక్‌క్వారీ తెరకెక్కిస్తున్నారు. పారామౌంట్ పిక్చర్స్, స్కైడాన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ రెండు చిత్రాల్లో.. 7వ సీక్వెల్‌ను ఈ ఏడాది సెప్టెంబర్ 30న, 8వ సీక్వెల్‌ను వచ్చే ఏడాది జులై 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా పరిస్థితుల వల్ల చిత్రీకరణలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఈ రెండు సినిమాలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థలు ప్రకటించాయి. కొత్త షెడ్యూల్ ప్రకారం.. ‘మిషన్: ఇంపాజిబుల్7’ను వచ్చే ఏడాది జులై 14న, ‘మిషన్: ఇంపాజిబుల్ 8’ను 2024 జూన్ 28న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.